Breaking News

అంబేద్కర్‌ మదిలో ‘హైదరాబాద్‌’.. కలకత్తా, ముంబైలను కాదంటూ..

Published on Mon, 04/14/2025 - 09:20

నేడు (ఏప్రిల్‌ 14) అంబేద్కర్‌ జయంతి. దేశంలోని దళితుల అభ్యన్నతికి పాటు పడిన అంబేద్కర్‌(Ambedkar)కు హైదరాబాద్‌పై ప్రత్యేక అభిప్రాయం ఉంది. అప్పట్లో హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని అంబేద్కర్ సూచించారు. కొంతకాలం దీనిపై చర్చ జరిగింది. అయితే ​మారిన కాలంతో పాటు చోటుచేసుకున్న పరిణామాలతో ఈ అంశం కొంతమేరకు మరుగున పడింది.

భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి రెండో రాజధాని(Second capital) అవసరమనే ఆలోచనను 1950వ దశకంలో తన పుస్తకం 'థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్'లో ప్రతిపాదించారు. ఈ పుస్తకంలో ఆయన దేశానికి రెండో రాజధాని అవసమని పేర్కొన్నారు. తద్వారా ఉత్తర-దక్షిణ ఉద్రిక్తతలను తొలగించేందుకు మార్గం ఏర్పడుతుందన్నారు. ఒక్క రాజధాని భారతదేశానికి సరిపోతుందా? అని  అంబేద్కర్‌ ప్రశ్నించారు. దేశ రెండో రాజధానిగా కలకత్తాను  ఎంచుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.  

కలకత్తా టిబెట్‌కు సమీపంలో ఉందని, అలాగే ముంబై సముద్ర తీరంలో ఉండటం వల్ల అది కూడా రెండో రాజధానిగా సురక్షితం కాదని అంబేద్కర్‌ భావించారు. ఈ దశలో చివరగా ఆయన హైదరాబాద్‌(Hyderabad)ను ఎంచుకున్నారు. ఈ ప్రాంతపు భౌగోళిక స్థానం దేశంలోని అన్ని దిశల నుంచి సమాన దూరంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని అంబేద్కర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్- బొలారం ప్రాంతాలను చీఫ్ కమిషనర్ ప్రావిన్స్‌గా ఏర్పాటు చేసి, భారతదేశ రెండో రాజధానిగా చేయాలని అంబేద్కర్‌  నాడు సిఫారసు చేశారు.

అంబేద్కర్ ఈ సూచనను భాషాపరమైన రాష్ట్రాలు ఏర్పడకముందే, అంటే 1960కి ముందు చేశారు. అయితే నేడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో భాగంగా ఉంది. రాష్ట్ర విభజన సమయంలో రెండో రాజధాని వాదన వినిపించింది. కాగా అంబేద్కర్ నాగ్‌పూర్‌ను రెండో రాజధానిగా పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని పలువురు విశేషంగా చెబుతుంటారు. అంబేద్కర్‌ 1956లో నాగపూర్‌లో బౌద్ధమతాన్ని స్వీకరించి, లక్షలాది మందిని కుల వివక్ష నుంచి విముక్తి చేసే చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: నేడు తమిళుల ఉగాది.. సొంత భాషలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)