Breaking News

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

Published on Sun, 06/30/2024 - 06:01

శ్రీనగర్‌: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ వార్షిక అమర్‌నాథ్‌ యాత్ర మొదలైంది. మొదటి రోజైన శనివారం అమర్‌నాథ్‌ గుహాలయంలోని స్పటిక శివలింగాన్ని 13 వేల మంది దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. యాత్ర సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. 
యాత్ర శుభప్రదం కావాలని ఆకాంక్షించారు. కాగా, శుక్రవారం సాయంత్రం జమ్మూలోని భగవతి నగర్‌ నుంచి బాల్టాల్, నున్వాన్‌ బేస్‌ క్యాంపులకు 4,603 మంది యాత్రికులు చేరుకోవడం తెల్సిందే. శనివారం ఉదయం వీరు బేస్‌ క్యాంపుల నుంచి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న ఆలయాన్ని దర్శించుకునేందుకు బయలుదేరారు.

 అనంత్‌నాగ్‌ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్‌– పహల్గాం సంప్రదాయ మార్గం ఒకటి కాగా, గండేర్‌బల్‌లోని ఇరుకైన 14 కిలోమీటర్ల బాల్టాల్‌ మార్గం మరోటి. ఈ రెండు మార్గాల గుండా సాగే యాత్రను సీనియర్‌ అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నానికల్లా యాత్రికులు కశ్మీర్‌ లోయకు చేరుకున్నారు. అక్కడ వీరికి అధికారులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు