Breaking News

అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు!

Published on Tue, 07/28/2026 - 10:02

గందర్‌బాల్: జమ్ముకశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 39 మంది గాయపడ్డారు. కంగన్ ప్రాంతంలోని హరిగన్వాన్ వద్ద మలుపు తిరుగుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న ఒక ఇంటిపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఇల్లు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, బస్సు సింధు నదిలోకి పడిపోకుండా ఆ ఇల్లు అడ్డుకుంది.

అమర్‌నాథ్ పవిత్ర గుహను దర్శించుకుని తిరిగి వస్తున్న యాత్రికులు ఈ ప్రమాదానికి గురయ్యారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే జమ్ముకశ్మీర్ పోలీసులు, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్, భారత సైన్యం సిబ్బందితో పాటు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తక్షణమే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారందరి పరిస్థితి నిలకడగా ఉందని, ఎక్కువ మందికి స్వల్ప గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు.

ఈ ప్రమాదంపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గందర్‌బాల్ డిప్యూటీ కమిషనర్, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జూలై 2న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రలో ఇప్పటివరకు 4.15 లక్షలకు పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆగస్టు 28తో ఈ వార్షిక యాత్ర ముగియనుంది.

ఇది కూడా చదవండి: కోర్టులో సాక్ష్యానికి ఏఐ సాయం .. చివరికి ఏమైందంటే?

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)