Breaking News

‘బంగ్లా’ సంక్షోభంతో ప్రమాదం లేదు: అఖిలపక్ష భేటీలో కేంద్రం

Published on Tue, 08/06/2024 - 10:38

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ పరిస్థితులపై కేంద్రం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. మంగళవారం(ఆగస్టు 6) పార్లమెంట్‌ భవనంలో జరుగుతున్న ఈ సమావేశంలో అఖిలపక్షనేతలకు బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ వివరించారు. బం‍గ్లాదేశ్‌లో ఉన్న 12 వేల మంది దాకా భారతీయులను ఇప్పటికిప్పుడు తీసుకురావాల్సినంత ప్రమాదమేమీ లేదని తెలిపారు. దేశ సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉన్నామని, అయినా సరిహద్దుల వద్ద పెద్ద ముప్పేమీ లేదని చెప్పారు. 

పదవి నుంచి తప్పుకుని భారత్‌ వచ్చిన ప్రధాని షేక్‌హసీనాతో మాట్లాడామని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు. బంగ్లాదేశ్‌లో చదువుకుంటున్న భారత విద్యార్థులు 8 వేల మంది ఇప్పటికే తిరిగి వచ్చారన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, జైశంకర్‌, కిరణ్‌రిజిజు, లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున్‌ఖర్గే వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. 

బంగ్లాదేశ్‌లో  ఆందోళనల కారణంగా ప్రధాని షేక్‌హసీనా  దేశం వీడి భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. హసీనా బంగ్లాదేశ్‌ను వీడిన తర్వాత అక్కడ ఆందోళనలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఖర్ఫ్యూ ఎత్తేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)