Breaking News

రేపు అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలపై చర్చ

Published on Mon, 01/26/2026 - 14:54

ఢిల్లీ:  పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో రేపు(మంగళవారం, జనవరి 27వ తేదీ)  ఉదయం గం. 11లకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.  ఉభయ సభల్లో  సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం కోరనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 29వ తేదీన ఆర్థికసర్వే ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామాన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఆదివారం వచ్చింది.  అయితే ఇలా ఆదివారం రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. 

జనవరి 28 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకూ రెండు దశల్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుండగా, మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకూ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తారు. 

ఇదిలా ఉంచితే, గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, ఎస్‌ఐఆర్‌లపై  కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు  విపక్షాలు  సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ రంగాల్లో సంస్కరణల కోసం  పలు కీలక బిల్లులను తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జేపీసీ పరిశీలనలో ఉన్న జమిలి ఎన్నికల కోసం 129 రాజ్యాంగ సవరణ బిల్లు కూడా  ఈసారి పార్లమెంట్‌ ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  విద్యారంగంలో సంస్కరణల కోసం  వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లును కూడా ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)