Breaking News

దీపాలపై డబ్బులు తగలేయొద్దు 

Published on Mon, 10/20/2025 - 05:56

లక్నో: దీపావళి వేడుకలపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీపాలు, కొవ్వొత్తులపై అనవసరంగా డబ్బులు తగలేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. దీపాలు వెలిగించడానికి ప్రజల సొమ్ము వృథా చేయొద్దని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘సలహాలు ఇవ్వాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ, రాముడి పేరిట ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా. 

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. కొన్ని నెలలపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. నగరాలు, ఇళ్లను విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరిస్తారు. మనం కూడా అలా ఎందుకు చేయకూడదు? క్రిస్మస్‌ నుంచి మనం ఎందుకు నేర్చుకోకూడదు. దీపాలు, కొవ్వొత్తుల కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. ఈ విషయం అందరూ ఆలోచించాలి. డబ్బులు వృథా చేయొద్దు. ప్రభుత్వం నుంచి మనం కోరుకొనేది ఆదే. విద్యుత్‌ దీపాలతో దీపావళి వేడుకలు చేసుకుందాం’’ అని ప్రజలకు అఖిలేశ్‌ యాదవ్‌ సూచించారు.  

ఆ దుర్గతి హిందువులకు పట్టలేదు: వీహెచ్‌పీ  
అఖిలేష్‌ యాదవ్‌ వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) జాతీయ అధికార ప్రతినిధి వినోద్‌ బన్సల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి దీపావళి సందర్భంగా క్రిస్మస్‌ను ప్రశంసిస్తున్నాడని, ఈ విషయం ప్రజలు గమనించాలని కోరారు. వరుస దీరిన దీపాలు అఖిలేశ్‌ హృదయాన్ని కాల్చేస్తున్నాయని చెప్పారు. అందుకే దీపాలపై డబ్బులు ఖర్చు చేయొద్దని చెబుతున్నాడని, క్రిస్మస్‌ను చూసి నేర్చుకోవాలని చెబుతున్నాడని విమర్శించారు. అఖిలేశ్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు స్పష్టంచేశారు. 

ఆయన ఆంటోనీ లేదా అక్బర్‌: బీజేపీ  
అఖిలేశ్‌ యాదవ్‌పై మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ మంత్రి, బీజేపీ నాయకుడు విశ్వాస్‌ సారంగ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అఖిలేశ్‌ను ఆంటోనీ లేదా అక్బర్‌ అని పిలవాలని అన్నారు. ఆయన మతం మారినట్లు కనిపిస్తోందని చెప్పారు. ప్రమిదలు తయారు చేసి, మన ఇళ్లల్లో వెలుగులు నింపే పేద కారి్మకులను అవమానిస్తారా? అని విశ్వాస్‌ సారంగ్‌ నిప్పులు చెరిగారు.    
 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)