Breaking News

భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో అఖిలేశ్‌

Published on Mon, 02/26/2024 - 05:57

ఆగ్రా: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సారథ్యంలో యూపీలో కొనసాగుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో ఆదివారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పాల్గొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో సీట్ల పంపిణీపై రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆగ్రాలో రహదారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ వారు ముందుకు సాగారు.

భారీగా హాజరైన ఇరుపార్టీల కార్యకర్తలు వారికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ..రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం రైతుల శక్తిని చూసి భయపడే పరిస్థితికి వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం గద్దెదిగి, ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.

తమ ప్రభుత్వం రైతులకు తగు గౌరవం ఇస్తుందని చెప్పారు. వెనుకబడిన కులాలు, దళితులు, మైనారిటీలకు బీజేపీ తగు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. యాత్రలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రి యాంకా గాంధీ వాద్రా కూడా పాల్గొ న్నారు. అంతకుముందు నేతలు ఆగ్రాలోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జోడో యాత్రలో అఖిలేశ్‌ పాల్గొనడంపై కాంగ్రెస్‌ హర్షం వ్యక్తం చేసింది.
 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)