Breaking News

Bihar Elections: ‘అవన్నీ ఫేక్‌.. అప్రమత్తంగా ఉండండి’: అఖిలేష్‌

Published on Wed, 11/12/2025 - 13:54

లక్నో: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్‌ను సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తోసిపుచ్చారు. అవి అధికార పార్టీ రూపొందించిన కల్పిత సర్వేలని అభివర్ణించారు. మార్పును కోరుతూ ఎన్నికల్లో  ఓటువేసిన ఓటర్లను ఆయన అభినందించారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడుపుతూ, యువతకు ఉద్యోగాలను సృష్టించే ప్రగతిశీల ప్రభుత్వం బీహార్‌లో త్వరలో ఏర్పడబోతోందని  అఖిలేష్‌ పేర్కొన్నారు.

అఖిలేష్‌ తన ‘ఎక్స్‌’ పోస్టులో బీహార్‌లోని ప్రతి ఓటరకు అభినందనలు తెలిపారు. ఉద్యోగాలను సృష్టించే కొత్త ప్రగతిశీల ప్రభుత్వం ఏర్పడుతుందంటూ, ముందస్తు అభినందనలు తెలిపారు. అధికార పార్టీ  తప్పుదారి పట్టించే ఎగ్జిట్ పోల్స్‌ను రూపొందించిందని ఆయన విమర్శించారు. ఇవి ప్రజలను గందరగోళపరిచేలా ఉన్నాయన్నారు. ఎన్నికల కమిషన్ ఓట్ల  లెక్కింపునకు  అన్ని రోజులు తీసుకుంటే, ఈ ఛానెల్స్‌ కేవలం ఒక గంటలో ఫలితాలను ఎలా అందించగలవు? వారి తప్పుడు గ్రాఫిక్స్ కొన్ని రోజుల ముందుగానే తయారవుతాయి. వారు ‘వనరులు’ అందించే వారితో పొత్తు పెట్టుకుంటారు’ అని ఆరోపించారు.

ఈ ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మేవారు ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను పరిశీలించాలని అఖిలేష్‌ యాదవ్ సూచించారు. నాడు యూపీలో చాలా మంది ప్రముఖ బీజేపీ నేతలు  ఓటమిని చవిచూశారన్నారు. బీహార్‌లో మహాకూటిమికి చెందిన చెందిన ప్రతి సభ్యుడు, అభ్యర్థి, మద్దతుదారుడు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అక్రమాలు జరిగితే వాటిని నిరోధించాలని విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ యంత్రాల స్థానాలను నిశితంగా పరిశీలించాలని, కౌంటింగ్‌ రోజున 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. ‘మహాకూటమి గెలుస్తోంది. మీకు విజయ ధృవీకరణ పత్రం వచ్చే వరకు విశ్రాంతి తీసుకోకండి’ అని ఆయన అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌.. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని పేర్కొన్నాయి. 

ఇది కూడా చదవండి: Delhi blast: అయోధ్యలో స్లీపర్‌ సెల్‌? వారణాసిలో..

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)