Breaking News

ముగిసిన అజిత్‌ పవార్‌ అంత్యక్రియలు

Published on Thu, 01/29/2026 - 08:09

ముంబై: ఎన్సీపీ నేత, దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ అంత్యక్రియలు ముగిశాయి. బారామతిలోని విద్యా ప్రతిష్టాన్‌ మైదానంలో  ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్‌ నితిన్‌ నబీన్‌, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌, ఏక్‌నాథ్‌ షిండే, మహారాష్ట్రకు చెందిన నేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అజిత్‌ పవార్‌ మృతికి మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అంతకు ముందు.. అజిత్‌ దాదా కడసారి చూపు కోసం రాజకీయ నేతలు, అభిమానులు బారామతిలోని ఆయన నివాసం వద్దకు క్యూ కట్టారు. ఆపై కటేవాడిలో కాసేపు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. అక్కడి నుంచి అంతిమ యాత్ర నడిచింది. దారి పొడవునా అల్విదా అజిత్‌ దాదా నినాదాలు హోరెత్తాయి. 

హఠాన్మరణం
మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తన సొంత నియోజక వర్గం బారామతిలో జరగబోయే ప్రచార సభలకు బుధవారం ఉదయం అజిత్‌ పవార్‌ చార్టెడ్‌ ఫ్లైట్‌లో బయల్దేరారు. అయితే ల్యాండింగ్‌ చివరి నిమిషంలో విమానం అదుపు తప్పి సమీపంలోని గోజుబావి గ్రామ సమీంలోని గుట్టల్లో కూలిపోయింది.

బండ రాయిని విమానం బలంగా ఢీ కొట్టి రెండు ముక్కులై.. పేలి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో అజిత్‌ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది, పైలెట్లు, ఫ్లైట్‌ అటెండెంట్‌ మొత్తం ఐదుగురు మరణించారు. ప్రమాదం ధాటికి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు కాలిపోయాయి. అయితే చేతి వాచీ ఆధారంగా అజిత్‌ పవార్‌ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. అజిత్‌ పవార్‌తో పాటు ప్రమాదంలో మరణించిన మిగతా వాళ్ల మృతదేహాలకు ఈ ఉదయం పోస్టుమార్టం పూర్తైంది. దీంతో పుణ్యశ్లోక్‌ అహల్యాదేవి హోల్కర్‌ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బంధువులు మృతదేహాలను తమ స్వస్థలాలకు తరలించారు.

ఈ ఘటనపై ఏఏఐబీ (Aircraft Accident Investigation Bureau.. విమాన ప్రమాదాల పరిశోధన బ్యూరో) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఘటనా స్థలం నుంచి పలు ఆధారాలు సేకరించింది. బ్లాక్‌ బాక్స్‌ను రికవరీ చేసుకుని డీ కోడింగ్‌ చేసుకునే పనిలో ఉంది. నిర్ణీత కాల వ్యవధిలో దర్యాప్తు జరుగుతుందని ఈ సందర్భంగా ఒక స్పష్టత ఇచ్చింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)