Breaking News

నెరవేరని ‘సీఎం’ కల

Published on Thu, 01/29/2026 - 06:00

అజిత్‌ పవార్‌. మహారాష్ట్ర రాజకీయాల్లో శిఖర సమానుడైన చిన్నాన్న శరద్‌ పవార్‌ నీడను దాటుకుని అంచెలంచెలుగా ఎదిగిన నేత. నాలుగు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పు తూ వచ్చారు. ఆయన రాజకీయ అడుగు లన్నీ ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా సాగుతూ వచ్చాయి. కానీ రికార్డు స్థాయిలో ఏకంగా ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రి కాగలిగినా, ‘సీఎం’ కల మాత్రం నెరవేరకుండానే విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

 తనకు రాజకీయంగా జన్మనిచ్చిన బారామతి గడ్డ మీదే తుది శ్వాస విడిచారు. కష్టించే స్వభావం అజిత్‌ సొంతం. ముఖ్యంగా సమయ పాలనకు పెట్టింది పేరు. ఆయన తండ్రి అనంత్‌రావ్‌ ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌కు అన్న. 22 ఏళ్ల వయసులో చక్కెర సహకార బోర్డు సభ్యునిగా 1982లో అజిత్‌ రాజకీయ అరంగేట్రం చేశారు. 1991లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. కొంతకాలానికే చిన్నాన్న శరద్‌ పవార్‌ కోసం ఆ స్థానాన్ని త్యాగం చేసి అసెంబ్లీకి వెళ్లారు. 

ఏకంగా 8సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. కాంగ్రెస్‌ను వీడి శరద్‌ పవార్‌ ఎన్సీపీని స్థాపించాక ఆ పార్టీలో అజిత్‌ కీలక నేతగా ఎదిగారు. సీఎం కావాలన్న తన అభిలాషను ఎప్పుడూ దాచు కోలేదు. పలుమార్లు ఎన్సీపీకి మెజార్టీ అసెంబ్లీ స్థానాలు దక్కినా కాంగ్రెస్‌కు సీఎం పదవి అప్పగించడాన్ని పలుమార్లు బాహాటంగానే వ్యతిరేకించారు. 2019లోనే చిన్నాన్నతో విభేదించి బీజేపీతో చేతులు కలిపినా ఫడ్నవీస్‌ సారథ్యంలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొద్ది గంటల్లోనే కూలిపోవడంతో మళ్లీ సొంత గూటికి చేరారు. 2022లో మరోసారి శరద్‌ పవార్‌పై తిరగుబావుటా ఎగరేయడమే గాక ఎన్సీపీని రెండుగా చీల్చారు. బీజేపీతో చేతులు కలిపి అధికార మహాయుతి సంకీర్ణంలో భాగస్వామిగా కొనసాగుతున్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)