Breaking News

రక్షణ రంగం బలోపేతంలో దోవల్‌ కీలకపాత్ర 

Published on Sun, 08/02/2026 - 05:08

పుణె: జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ భారత రక్షణ సామర్థ్యాన్ని గత పుష్కరకాలంలో సమున్నత స్థాయికి తీసుకెళ్లారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కొనియాడారు. శనివారం పుణెలో జరిగిన కార్యక్రమంలో అజిత్‌ దోవల్‌కు అమిత్‌ షా ‘లోకమాన్య తిలక్‌ నేషనల్‌ అవార్డ్,2026’ను ప్రదానంచేశారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడారు. ‘‘రక్షణాత్మక వైఖరితోపాటు విరుచుకుపడే తత్వాన్ని దోవల్‌ సారథ్యంలో భారత సాయుధ బలగాలు అందిపుచ్చుకున్నాయి. 

భారత విదేశాంగ విధానం బలపడటంలోనూ దోవల్‌ తనదైన పాత్ర పోషించారు. ప్రధాని మోదీ జాతీయ భద్రతకు సంబంధించి తీసుకున్న ప్రతి తుది నిర్ణయంలోనూ దోవల్‌ కీలకమైన పాత్ర పోషించారు.  2008లో నేను గుజరాత్‌ హోం మంత్రిగా ఉన్నప్పుడు అహ్మదాబాద్‌లో వరసబెట్టి బాంబుపేలుళ్లు జరిగాయి. నాడు సీఎం హోదాలో మోదీయే దోవల్‌కు ఈ పేలుళ్ల కారకులను కనిపెట్టాలని సూచించారు. ఈ ఘటనతోపాటు మొత్తం దేశవ్యాప్తంగా 13 బాంబుపేలుళ్ల ఘటనలను దోవల్‌ ఛేదించారు’’అని అమిత్‌ షా కొనియాడారు. 

దేశసేవకు సిద్ధంగా ఉండాలి: దోవల్‌ 
ఈ సందర్భంగా దోవల్‌ మాట్లాడారు. ‘‘స్వేచ్ఛ అంటే మనం ఏదైనా చేయొచ్చని నేటి యువత భావిస్తోంది. అది సబబు కాదు. స్వీయ ప్రయోజనాల కోసమేకాదు యువత దేశ ప్రయోజనాలనూ పట్టించుకోవాలి. ఏరకంగానైనా దేశ సేవ చేసేందుకు యువతరం సంసిద్ధంకావాలి. దేశ చరిత్రలోనే నేడు భారత్‌ సమున్నతంగా ఎదిగే సువర్ణావకాశం వచ్చింది. దీనిని మనం చేజార్చుకోవద్దు. దేశం కోసం త్యాగాలు చేసేందుకు సిద్దపడాలి.

 తిలక్‌ పుణెలో ప్లేగువ్యాధి ప్రబలి తన 21 ఏళ్ల కుమారుడిని కోల్పోయినా ఆయన ఈ నగరాన్ని వీడలేదు. నగరసేవకు ప్రాధాన్యతనిచ్చారు. యువత చిన్నపాటి వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి దేశ సేవ కోసం ఆలోచించాలి. స్వరాజ్యం నా జన్మహక్కు అని తిలక్‌ అనుకుని అక్కడితో ఆగిపోలేదు. అదే స్పృహ అందరిలో కలిగేలా స్ఫూర్తి కణికలు మండించారు’’అని దోవల్‌ వ్యాఖ్యానించారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)