Breaking News

ఎయిర్‌ ఇండియా ‘మూత్ర విసర్జన’ ఘటనలో కొత్త కోణం

Published on Fri, 01/13/2023 - 17:30

ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. మద్యం మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్‌ మిశ్రా.. తను ఆమె పట్ల ఆ విధంగా ప్రవర్తించలేదని తెలిపాడు. వాస్తవానికి వృద్ధురాలిపై తాను మూత్ర విసర్జన చేయలేదని.. ఆ మహిళే తన సీట్లో మూత్ర విసర్జన చేసుకుందని ఢిల్లీ పాటియాలా కోర్టుకు శుక్రవారం వెల్లడించారు. వృద్ధ మహిళ తనను తానే మూత్ర విసర్జన చేసుకుని తనపై ఆరోపణలు చేస్తోందని ఆరోపించాడు.

ఈ మేరకు కోర్టులో మిశ్రా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. వృద్ధురాలు తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మూత్ర విసర్జన చేసిందని పేర్కొన్నారు. ఆ మహిళ 30 ఏళ్లుగా భరతనాట్యం నృత్యకారిణి అని, వారికి మూత్ర విసర్జన సమస్య రావడం సహజమేనని కోర్టుకు తెలిపారు. కాగా విచారణ నిమిత్తం శంకర్‌ మిశ్రాను కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు పాటియాలా హౌస్ కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు అతనికి బుధవారం నోటీసులు జారీ చేసింది. అంతేగాక​ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కోర్టు నోటీసులపై విచారణ సందర్భంగా మిశ్రా పై వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: 12 రోజుల్లోనే 5.4 సె.మీ కుంగిపోయిన జోషిమఠ్.. వాళ్లకు ఆర్థిక సాయం

అసలేం జరిగిందంటే..
గతేడాది నవంబర్‌ 26న న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానంలో మద్యం మత్తులో శంకర్‌ మిశ్రా  అనే వ్యక్తి సహప్రయాణికురాలికి మూత్ర విసర్జన చేశాడు. ఎయిరిండియాకు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు జనవరి 4న మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మిశ్రా పరారీలో ఉన్నాడు.

దీంతో పోలీసులు అతనిపై లుకౌట్‌ పోలీసులు జారీ చేసిన తర్వాత నిందితుడిని బెంగళూరులో అరెస్టు చేశారు.ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ  డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఎయిర్‌ ఇంఇయాకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది,  ఈ చర్య అనంతరం మిశ్రాను ఉద్యోగంలో నుంచి తీసేశారు.  మిశ్రాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ శనివారం కోర్టు ఆదేశించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)