Breaking News

Air India Plane Crashed: వీరంతా మృత్యువును తప్పించుకున్నారిలా..

Published on Sun, 06/15/2025 - 13:48

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం చరిత్రలో పెను విషాదంగా నిలిచిపోనుంది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 242 మంది ప్రయాణికులలో 241 మంది మృతి చెందారు. విశ్వాస్ రమేష్ అనే ప్రయాణికుడు మాత్రం ప్రమాదం నుంచి బయపడ్డారు. అయితే తల్లి మాట కారణంగా యమన్ వ్యాస్, సరైన పత్రాలు లేక జామిని, ప్రియా పటేల్, ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి భూమి చౌహాన్ ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ప్రమాదం జరిగిన జూన్‌ 12న గుజరాత్‌కు చెందిన యమన్ వ్యాస్ అదే విమానంలో ఎక్కేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. కుమారునికి వీడ్కోలు పలికే సమయంలో వ్యాస్‌ తల్లి భావోద్వేగానికి లోనయ్యింది. ‘కొన్ని రోజులు ఇక్కడే ఉండవచ్చు కదా’ అని అడిగింది. అంతే తల్లి ప్రేమకు తలొగ్గిన వ్యాస్‌ వెంటనే తన విమాన టికెట్‌ను రద్దు చేసుకున్నాడు. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకెన్లకే నేల కూలింది. విమాన ప్రమాదం వార్త వినగానే యమన్ దిగ్బ్రాంతికి లోనయ్యారు. తన తల్లే తనను కాపాడిందని ఆయన మీడియాకు తెలిపారు.

యమన్ వ్యాస్‌  కొన్నేళ్లుగా యూకేలో పనిచేస్తున్నారు. రెండేళ్ల తర్వాత వడోదర వచ్చారు. తన కుటుంబంతో కొన్ని రోజులు ఉన్నాక, తిరిగి లండన్‌కు బయలుదేరారు. అయితే అతని తల్లి పట్టుబట్టడంతో తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఆయన విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అహ్మదాబాద్‌లోని చంద్లోడియాకు చెందిన జామిని, ప్రియా పటేల్ కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరు తమ స్నేహితుని ఆహ్వానం మేరకు ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో లండన్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరు విజిటర్ వీసాపై ప్రయాణానికి బయలుదేరారు. అయితే వీరి దగ్గర కొన్ని పత్రాలు లేని​​ కారణంగా, విమానం ఎక్కేందుకు అనుమతి లభించలేదు. దీంతో నిరాశగా ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇంతలో విమాన ప్రమాదం గురించి వారికి తెలిసింది. ఇదేవిధంగా భారత్‌కు వచ్చిన బ్రిటన్ నివాసి భూమి చౌహాన్ అహ్మదాబాద్‌లో భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దీంతో ఆమె విమానాశ్రయానికి చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో ఆమె విమానం ఎక్కలేకపోయారు. 

ఇది కూడా చదవండి: Air India Plane Crashed: 31 మృతదేహాల నిర్థారణ.. డీఎన్‌ఏ పరీక్షలు ముమ్మరం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)