Breaking News

మృత్యుంజయుడు రమేశ్‌ 

Published on Thu, 06/12/2025 - 19:18

అహ్మదాబాద్‌:  రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌ బుచార్‌వాడ.. అత్యంత అదృష్టవంతుడంటే ఇతడే. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో.. ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డాడు. 38 ఏళ్ల రమేశ్‌ బ్రిటీష్‌ జాతీయుడు. తన సోదరుడితో కలిసి లండన్‌కు పయనమయ్యాడు. ఏఐ171 విమానంలో 11ఏ సీట్లో కూర్చున్నాడు. అత్యవసర ద్వారానికి వెనుకే ఈ సీటు ఉంది. విమానం నేలకూలి మంటల్లో చిక్కుకున్న తర్వాత రమేశ్‌ గాయాలతో బయటకు వస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. 

కొందరు వ్యక్తుల సాయంతో అంబులెన్స్‌ వద్దకు చేరుకున్నాడు. విమానంలోని ఇతర ప్రయాణికుల గురించి జనం అతడిని ఆరా తీశారు. చాలామంది రమేశ్‌ చుట్టూ గుమికూడారు. ప్రయాణికులంతా అక్కడే(ఘటనా స్థలంలో) ఉన్నారు అంటూ బలహీన స్వరంతో బదులిచ్చాడు. విమానం ఒక్కసారిగా పేలిపోయిందని, తన చుట్టూ శకలాలే కనిపించాయని చెప్పాడు. ప్రమాదం నుంచి బయటపడిన రమేశ్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అహ్మదాబాద్‌ పోలీసు కమిషనర్‌ జి.ఎస్‌.మాలిక్‌ తెలిపారు. 
 

(రమేష్‌ విశ్వకుమార్‌ కుమార్‌ ఎయిరిండియా విమానం టికెట్‌)

ప్రయాణం వాయిదాతో  బతికాడు
ఇదే విమానంలో వెళ్లాల్సిన శావ్‌జీభాయి తింబాడియా చివరి నిమిషంలో ప్రయాణం వాయిదా వేసుకోవడం అతడి పాలిట వరంగా మారింది. లండన్‌లో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లడానికి ఆయన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాడు. కుమారుడే విమానం టికెట్‌ బుక్‌ చేశాడు. విమానంలో సీటు కూడా తింబాడియాకు కేటాయించారు. కానీ, తింబాడియా చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు. తన ప్రయాణాన్ని నాలుగు రోజులపాటు వాయిదా వేసుకున్నాడు. అదే ఆయన ప్రాణాన్ని కాపాడింది. గురువారం జరిగిన ప్రమాదం గురించి తెలిసి తింబాడియా దిగ్భ్రాంతి చెందాడు. భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. తాను నమ్మే దైవమైన స్వామి నారాయణ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)