Breaking News

టేకాఫ్‌ రద్దు.. తప్పిన విమాన ప్రమాదం

Published on Tue, 07/22/2025 - 07:52

న్యూఢిల్లీ: మరో విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుండి కోల్‌కతాకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం  రన్‌వేపై వేగంగా వెళుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిని సకాలంలో గుర్తించడంతో టేకాఫ్‌ను రద్దు చేశారు. ఆ సమయంలో గంటకు 155 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న విమానాన్ని ఆపేందుకు పైలట్లు బ్రేకులు వేసి, ప్రమాదం జరగకుండా చూశారు.

సోమవారం సాయంత్రం 5:30 గంటలకు కోల్‌కతాకు బయలుదేరాల్సిన ఏఐ2403 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు తమ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని అనుసరించి టేకాఫ్‌ను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటన దరిమిలా ప్రయాణీకులంతా దిగిపోయారని, ఈ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి  చింతిస్తున్నామని ఎయిర్‌ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
 

సోమవారం ఈ ఘటనకు ముందు ముంబైలో కొచ్చికి వెళుతున్న విమానం  వర్షంలో తడిసిన రన్‌వేను తప్పించుకుని, విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదం తలెత్తింది. ఒక ఇంజిన్‌తో పాటు రన్‌వే కూడా దెబ్బతింది. అయితే విమానంలోని ప్రయాణికులకు ఎటువంటి హాని జరగలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

ఇదిలావుండగా గత ఆరు నెలల్లో ఐదు భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి ఎయిర్ ఇండియాకు తొమ్మిది షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రాజ్యసభలో తెలియజేసింది. గత నెలలో అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 260 మంది మృతిచెందారు. 11ఏ సీటులో ఉన్న ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)