Breaking News

ముంబై ఘటన.. ఎయిరిండియాకు జరిమానా

Published on Thu, 02/29/2024 - 15:19

ఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) భారీ జరిమానా విధించింది. వీల్‌చైర్‌ సౌకర్యం కల్పించకపోవటంతో 80 ఏళ్ల ప్రయాణికుడు మృతి చెందిన ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఫిబ్రవరి 16న ముంబైలో చోటు చేసుకుంది.

ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టులో  విమానం నుంచి టెర్మినల్‌ వరకు ఆ ప్రయాణికుడికి వీల్‌ ఛైర్‌ సౌకర్యం కల్పించపోవటంపై డీజీసీఏ సీరియస్‌ అయింది. ఈ ఘటనపై ఎయిరిండియాకు డీజీసీఏ షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. ఏడు రోజుల్లో ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పూర్తి వివరణ ఇవ్వాలంది. అదే విధంగా ఎయిర్‌ ఇండియా రూ. 30 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. 

‘ ఇద్దరు ప్రయాణికులు ఫిబ్రవరి 12న న్యూయార్క్‌ నుంచి ముంబైకి వచ్చారు. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడు, ఆయన భార్య  ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. అయితే వీల్‌ చైర్‌లకు అధిక డిమాండ్‌ ఉండటంతో ఆయన భార్యకు వీల్‌ చైర్‌ సౌకర్యం కల్పిచాం. ఆయనకు సైతం కల్పిస్తామని సిబ్బంది విజ్ఞప్తి చేసింది. కానీ ఆయన వినకుండా తన భార్యతో పాటు నడుచుకుంటూ వెళ్లారు’ అని ఎయిరిండియా తెలిపింది.

అయితే డీజీసీఏ చేపట్టిన విచారణలో ఎయిరిండియా  దివ్యాంగులు, వృద్ధులకు కల్పించాల్సిన వీల్‌ చైర్ సౌకర్య నిబంధనలు సరిగ్గా పాటించటం లేదని తేలింది. ఈ ఘటన నేపథ్యంలో.. ప్రయాణికులకు అవసరమైన వీల్‌ చైర్లను అందుబాటులో ఉంచాల్సిందేనని విమాన సంస్థలకు డీజీసీఏ నొక్కి చెప్పింది.

చదవండి:  1993 రైలు బాంబు పేలుళ్ల కేసులో ‘డాక్టర్‌ బాంబ్‌’ తుండాకు ఊరట!

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)