Breaking News

Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై..

Published on Sat, 06/14/2025 - 07:35

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రపంచం యావత్తూ సంతాపం తెలుపుతోంది. ఈ ప్రమాదంలో అయినవారిని కోల్పోయినవారు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఒక్కో బాధిత కుటుంబానిది ఒక్కో విషాద గాథ. వీటిని వింటున్నప్పుడు ఎవరికైనా కళ్లు చమర్చరకమానవు. ఎయిర్ ఇండియా విమానం ఏI 171 ప్రమాదంలో మరణించిన  242 మందిలో 37 ఏళ్ల జావేద్, అతని భార్య మరియం, వారి ఐదేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె కూడా ఉన్నారు.

తల్లితో పండుగ చేసుకునేందుకు వచ్చి..
15 ఏళ్ల తరువాత ఈద్ అల్-అధా పండుగను తమ తల్లితో కలిసి చేసుకునేందుకు జావేద్‌ నలుగురు తోబుట్టువులు తమ కుటుంబాలతో సహా అహ్మదాబాద్‌కు తరలివచ్చారు.  ఈ విధంగా కుటుంబంలోని అందరూ కలుసుకునేందుకు వారు ఏళ్ల తరబడి ఎదురు చూశారు. అయితే ఈ విమాన ప్రమాదం వారి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేస్తుందని వారు ఆ సమయంలో గ్రహించలేకపోయారు. ఈ ప్రమాదంలో జావేద్‌ కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయిందనే సంగతిని హృద్రోగంతో బాధపడుతూ, త్వరలో చికిత్స చేయించుకోబోతున్న అతని తల్లికి చెప్పేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు.

దీనికి ఎవరు బాధ్యులు?
తమ కుటుంబంలో నెలకొన్న విషాదం గురించి జావేద్‌  సోదరుడు ఇంతియాజ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘అహ్మదాబాద్ సివిల్  ఆస్పత్రిలో బాధితులను గుర్తించేందుకు వారి నమూనాలను సేకరిస్తున్నారని అధికారులు తెలిపారు. మా సోదరుడు సంతోషంగా వేడుకలు చేసుకునేందుకు అహ్మదాబాద్ వచ్చాడు. ఇప్పుడు మేము నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయాం. దీనికి ఎవరు బాధ్యులు? ఈ ‍ప్రమాదంలో 240 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందారు. విమానం బయలుదేరిన కొద్ది సెకెన్లకే అది కూలిపోయింది. ఇది ఎలా జరిగింది? 11  ఏళ్ల క్రితం చదువుకునేందుకు యూకే వెళ్లిన నా సోదరుడు మరియంను వివాహం చేసుకుని, బ్రిటిష్ పౌరునిగా మారాడు.

‘అమ్మకి రెండు వారాల్లో  గుండె ఆపరేషన్‌’
మా అమ్మతో ఈద్ వేడుక చేసుకునేందుకు జావేద్ ఇక్కడికి వచ్చాడు. అమ్మకి రెండు వారాల్లో  గుండె ఆపరేషన్‌ జరగాల్సివుంది.  మేమంతా గత 15 ఏళ్లుగా ఎప్పుడూ కలిసివుండలేదు.  మా అమ్మకి ఇంకా ఆ విషయం చెప్పలేదు. జావేద్‌ను ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పాం. మా కుటుంబం ఇద్దరు చిన్నారులను కూడా కోల్పోయింది. ఇది మాకు తీరని విషాదం. గురువారం రాత్రి జావేద్ మృతదేహాన్ని గుర్తించేందుకు రక్త నమూనాను ఇచ్చాను. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అధికారులు చెబుతున్నారు. డీఎన్‌ఏ రిపోర్టు వచ్చాకనే మా సోదరుణ్ణి గుర్తించగలుగుతాం. ఆదివారం నాటికి  రిపోర్టు వస్తుందని చెబుతున్నారు’ అని  ఇంతియాజ్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులలో 241 మంది మృతిచెందారు. 

ఇది కూడా చదవండి: వింత రైల్వే వంతెన.. భయపెడుతున్న 90 డిగ్రీల మలుపు..

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)