Breaking News

‘171’ నంబర్‌కు బైబై.. నంబర్లు మార్చేసిన ఎయిర్‌ ఇండియా

Published on Sun, 06/15/2025 - 07:19

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో ‘ఏఐ171’అనే నంబర్‌ కలిగిన బోయింగ్‌ 787–8 విమానం కూలిపోవడం, 270 మంది మరణించడంతో ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ విమానాలకు ఏఐ171, ఐఎక్స్‌ 171 పేర్లను తొలగించాయి.

ఇక, అహ్మదాబాద్‌–లండన్‌ మధ్య నడిచే విమానాన్ని ఈ నెల 17వ తేదీ నుంచి ‘ఏఐ159’ అనే కొత్త నంబర్‌తో పిలువనున్నట్లు ఎయిర్‌ ఇండియా వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ మేరకు టికెట్ల బుకింగ్‌ వ్యవస్థలో శుక్రవారం నుంచే మార్పులు చేసినట్లు తెలిపాయి. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సైతం తమ విమానానికి ‘ఐఎక్స్‌171’నంబర్‌ను వదులుకుంటున్నట్లు వెల్లడించింది. కొత్త నంబర్‌ను ఇంకా ప్రకటించలేదు. ప్రమాదానికి గురైన విమానం నంబర్‌ను మార్చడం కొత్తేమీ కాదు. ప్రమాదంలో మరణించినవారికి నివాళిగా పాత నంబర్‌ను వదిలేసుకోవడం చాలా ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోంది.    

ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్‌ ప్రమాదానికి గురైన విమానంలోని ఎయిర్‌ ఇండియా పైలట్‌ చివరి మాటలు బయటకు వచ్చాయి. విమానం పైకి ఎగరడం లేదు. కిందికి పడిపోతోంది. ఇప్పుడు కమ్యూనికేషన్‌ లైన్‌ బలహీనంగా ఉంది. మేడే అని.. విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ)కు పైలట్‌ చివరి సందేశం చేరవేశాడు. ఏదో పెద్ద ప్రమాదమే జరగబోతోందని ఈ సందేశాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గురువారం మధ్యాహ్నం 1.37 గంటలకు అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయి పటేల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఏఐ171 విమానం కొన్ని క్షణాల వ్యవధిలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే.   

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)