తమ్ముడి కోసం ఎవరూ చేయలేని త్యాగం చేసిన అన్న

Published on Mon, 08/03/2026 - 21:35

కాన్పూర్: ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన కవల సోదరులు మహరూఫ్ అహ్మద్ ఖాన్, మస్రూర్ అహ్మద్ ఖాన్ తమ అనుబంధంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అద్భుతమైన ర్యాంకులు సాధించినప్పటికీ వేర్వేరు ఐఐటీల్లో చేరకుండా కలిసి చదువుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు.

వైద్య దంపతుల కుమారులైన 18 ఏళ్ల మహరూఫ్, మస్రూర్‌లు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వరుసగా 32, 169 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు. మహరూఫ్‌కు ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ సీటు వచ్చినప్పటికీ, తన సోదరుడు అదే కోర్సులో అక్కడ సీటు పొందకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. ఇద్దరికీ కంప్యూటర్ సైన్స్‌లో ప్రవేశం లభించిన ఐఐటీ కాన్పూర్‌లో కలిసి బీటెక్ చదవాలని నిర్ణయించారు.

ఐఐటీ కాన్పూర్ ఓరియంటేషన్ సందర్భంగా మహరూఫ్ మాట్లాడుతూ.. నా సోదరుడి కోసం ఐఐటీ బాంబేను వదులుకుని రావడంపై నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అతనికంటే నాకు ముఖ్యమైనది ఏదీ లేదు అని తెలిపాడు.

ఈ కవలలు జేఈఈ సన్నాహకానికి రాజస్థాన్‌లోని కోటాలో మూడేళ్లు కలిసి శిక్షణ పొందారు. జూలై 21న ఐఐటీ కాన్పూర్‌లో చేరిన వీరిద్దరూ, ఇకపై కూడా ఒకరికొకరు అండగా ఉంటూ చదువులో ముందుకు సాగాలని సంకల్పించారు. అన్న చేసిన ఈ త్యాగాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పటిలాగే ఒకరికొకరం తోడుగా ఉంటాం అని మస్రూర్ పేర్కొన్నాడు.

మొదట కళాశాల యాజమాన్యం వీరికి ఒకే హాస్టల్‌లో వేర్వేరు గదులు కేటాయించింది. అయితే అధికారులను కోరడంతో హాల్ ఆఫ్ రెసిడెన్స్–13లోని B103 గదిని ఇద్దరికీ కేటాయించారు.

వారి విజయంలో తల్లి డాక్టర్ జీనత్ బేగం కీలక పాత్ర పోషించారు. కుమారులు కోటాలో కోచింగ్ తీసుకునే సమయంలో ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి వారితో కలిసి అక్కడే ఉండి చదువుకు పూర్తి సహకారం అందించారు. తండ్రి డాక్టర్ మన్సూర్ అహ్మద్ ఖాన్ ఉద్యోగరీత్యా ఒడిశాలోనే ఉంటూ తరచూ కుటుంబాన్ని సందర్శించేవారు.

తన కుమారులు ఒకే కాలేజీలో ఇప్పుడు ఒకే గదిలో కలిసి ఉండడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ జీనత్ బేగం తెలిపారు. ఇక చిన్నప్పటి నుంచే ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనదని మహరూఫ్ గుర్తు చేసుకుంటూ..ఐదో తరగతిలో జ్వరంతో బాధపడుతున్న మస్రూర్ స్థానంలో తాను కరాటే ప్రదర్శనలో పాల్గొన్న సంఘటనను స్మరించుకున్నాడు.

#

Tags : 1

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)