Breaking News

AIMPLB ప్రెసిడెంట్‌ కన్నుమూత

Published on Thu, 04/13/2023 - 17:54

ఢిల్లీ: ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు AIMPLB ప్రెసిడెంట్‌ రాబే హసానీ నద్వి(94) ఇక లేరు. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న నద్వి.. గురువారం కన్నుమూశారు. 

అనారోగ్యంతో బాధపడుతున్న నద్విని చికిత్స కోసం రాయ్‌బరేలీ నుంచి లక్నోకు తరలించారు. అయితే దాలిగంజ్‌లోని నద్వా మదరాసాకు ఆయన్ని తరలించగా.. అక్కడే ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. సున్నీ ఇస్లామిక్‌ స్కాలర్‌ అయిన నద్వి..  ముస్లిం విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం విపరీతంగా కృషి చేశారు.

ఉత్తర ప్రదేశ్‌ రాయ్‌బరేలీ టాకియా కలాన్‌లో జన్మించిన రబే హసానీరాబే హసానీ నద్వి.. 2018 నుంచి ఏఐఎంపీ చీఫ్‌గాను పని చేస్తూ వచ్చారు.  దారుల్ ఉలూమ్ నద్వతుల్ ఉలమా ఛాన్సలర్‌గా పని చేశారీయన. విద్యా రంగానికి నద్వి అందించిన సేవలకు మంచి పేరు దక్కింది. ప్రతీ సంవత్సరం ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన ముస్లింల జాబితాలో ఈయన పేరు క్రమం తప్పకుండా ఉంటోంది. 

యూపీ ప్రభుత్వం నుంచి పలు ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు అరబిక్‌ భాషకు, సాహిత్యానికి చేసిన కృషికిగానూ రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. నద్వి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం చెబుతున్నారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)