Breaking News

ఇంటర్న్‌షిప్‌ జాతర.. లక్షమందికి సదవకాశం

Published on Sat, 10/25/2025 - 12:54

న్యూఢ్లిలీ: దేశవ్యాప్తంగా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ, అనుభవాన్ని అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి­(ఏఐసీ­టీఈ) ప్రత్యేక ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌–­2026­ను ప్రకటించింది. జాతీయ ఇంటర్న్‌షిప్ పోర్టల్ ద్వారా ఒక కోటి ఇంటర్న్‌షిప్‌లను అందించే లక్ష్యంలో భాగంగా ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రస్తుతం లక్షమందికి ఉచిత ఇంటర్న్‌­షిప్‌ అవకాశాన్ని కల్పిస్తోంది.

ఎవరు చేరవచ్చు?
ఇంజినీరింగ్‌తో­పాటు మేనేజ్‌మెంట్, ఆర్ట్స్, కామర్స్‌, డిప్లొమా విద్యార్థులకు బోధన కాలంలోనే ఆచర­ణాత్మక వృత్తి నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ఏఐసీటీఈ ప్రవేశ­పెట్టింది. తద్వారా అభ్యాసం, పరిశ్రమలకు మధ్య అంతరాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ముఖ్యంగా విద్యార్థులను రెడీ టూ వర్క్‌కు సిద్ధం చేస్తోంది. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఆర్ట్స్, కామర్స్ మొదలైన విభాగాలలో డిప్లొమా, యూజీ, పీజీ చేస్తున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రూ.15వేల వరకు స్టయిఫండ్‌
లక్ష మందికి పైగా ఉచితంగా అందించే ఇంటర్న్‌­షిప్‌లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానంలోఏఐసీటీఈ అందిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ–ఎథికల్‌ హ్యాకింగ్, ఎలక్ట్రిక్‌ వెహికల్స్, స్పేస్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌–డేవ్‌ ఆప్స్, ప్రభుత్వంలోని నీతి ఆయోగ్, భారత ప్రభుత్వ విధా­­నాలు, ఎంఎస్‌ఎంఈ కార్యక్రమాలు, మహిళా సాధికారత, స్మార్ట్‌ విలేజ్, ఏఐసీటీఈ గ్రామీణ ఆవి­­ష్కరణ మిషన్ల కార్యక్రమాలు వంటి ప్రభుత్వ, నూతన సాంకేతిక అంశాల్లో వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ కల్పిస్తుంది. ఇంటర్న్‌షిప్‌ కాలవ్యవధి 4 నుంచి 12 వారాలు కాగా, కొన్ని సంస్థలు రూ.5వేల నుంచి రూ.15వేల వరకు స్టయిఫండ్‌ ఇస్తాయి. ఇంటర్న్‌షిప్‌ ముగిసిన తర్వాత ఏఐసీటీఈ పోర్టల్‌ ద్వారా డిజిటల్‌ సర్టిఫికెట్‌ అందిస్తారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఎంపికలో తొలి ప్రాధాన్యత ఇస్తారు.

భాగస్వామ్య సంస్థలు
ఈ ఇంటర్న్‌షిప్‌లను కింద పేర్కొన్న ప్రముఖ కంపెనీలు,  ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తాయి.
ఐబీఎం
సిస్కో
మైక్రోసాఫ్ట్
ఇస్రో
డీఆర్‌డీఓ
నాస్కామ్‌(NASSCOM)
నీతి ఆయోగ్‌
ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ

నైపుణ్యం అందించే విభాగాలు
విద్యార్థులు అత్యాధునిక డొమైన్‌లలో ఈ కింద పేర్కొన్న నైపుణ్యాలను పొందవచ్చు
కృత్రిమ మేధస్సు
సైబర్ సెక్యూరిటీ అండ్‌ ఎథికల్‌ హ్యాకింగ్
ఎలక్ట్రిక్ వాహనాలు
స్పేస్ టెక్నాలజీ
క్లౌడ్ కంప్యూటింగ్ అండ్‌ డెవ్‌ఆప్స్
స్మార్ట్ విలేజ్ ఇన్నోవేషన్
ప్రభుత్వ  పాలసీ అండ్‌ మహిళా సాధికారత

ఎలా దరఖాస్తు చేయాలి?
విద్యార్థులు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఈ ఇంటర్న్‌షిప్‌ బాటలు వేస్తోంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో డిప్లొమా, యూజీ, పీజీ­లలో ఏ విభాగానికి చెందిన విద్యార్థులైనా ఉచితంగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ను ఈ లింక్‌  ( https://internship.aicte-
india.org/) ద్వారా చేసుకోవచ్చు.
 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)