Breaking News

ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలి: ఖర్గే

Published on Sat, 11/01/2025 - 06:33

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించాలని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ‘ఆర్‌ఎస్‌పై నిషేధం విధించాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ కు ప్రధాని, అమిత్‌ షా గౌరవం ఇవ్వాలనుకుంటే ఇది జరగాలి. దేశంలో జరుగుతున్న ఘర్షణలకు, శాంతి భద్రతల సమస్యలకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ లే కారణం’అని అన్నారు. 

సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ 150వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో ఖర్గే విలేకరులతో మాట్లాడారు. ‘గాం«దీజీని హత్య చేసిన వారే.. పటేల్‌ను కాంగ్రెస్‌ స్మరించదంటున్నారు. మహాత్ముని హత్య తర్వాత అప్పటి హోం మంత్రి వల్లభాయ్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించారు. అయితే.. 9 జూలై 2024న 81ఏళ్ల తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌పై ఉన్న నిషేధాన్ని మోదీ ప్రభుత్వం తొలగించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. దీనిని రద్దు చేయాలని మేము ఇప్పటికీ కోరుతున్నాం’’అని ఖర్గే స్పష్టం చేశారు.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)