Breaking News

‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా’

Published on Sat, 02/24/2024 - 19:38

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మరణించి ఏడేళ్లు అవుతోంది. నేడు(శనివారం) ఆమె 76వ జయంతి సందర్భంగా ఏఐఏడీఎంకే జనరల్‌ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌), పలువురు సీనియర్‌ నేతలు, కార్యకర్తలు జయలలిత(అమ్మ)కు నివాళులు అర్పించారు. అయితే ఈసారి వినూత్నంగా  ‘అమ్మ’ జయంతిని పురస్కరించుకొని.. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడానికి ఏఐఏడీఎంకే సరికొత్తగా ఆలోచించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI)తో తయారుచేసిన ‘అమ్మ’వాయిస్‌ క్లిప్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘అమ్మ’తో ఉన్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఏఐ వాయిస్‌ క్లిప్‌లో అచ్చం ‘అమ్మ’నే పార్టీ నేతలు, కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడినట్టు ఉండటం విశేషం.

ఆ ఏఐ క్లిప్‌లో దివంగత నేత జయలలిత ప్రసంగం ఇలా ఉంది... ‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా.  ఈ సాంకేతికతకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకుంటే నేను మీతో మాట్లాడే అవకాశం ఇచ్చింది. మన పార్టీ చాలా ఎత్తుపల్లాలను చూసింది. మనం అధికారంలో ఉన్నో సమయంలో మహిళలు, విద్యార్థులకు అనేక సంక్షేమ పథకలు ప్రవేశపెట్టి అమలు చేశాం.

...ప్రస్తుతం ఒకవైపు మనకు ద్రోహం చేసే కేంద్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు అవినీతితో నిండిపోయిన పనికిరాని రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నా పుట్టిన రోజు సందర్భంగా ఒకటి చెబుతున్నా.. మన పార్టీ నేతృత్వంలో ప్రజల ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. మన కార్యకర్తలంతా నా మార్గంలో పార్టీ కోసం నడవాలని కోరుతున్నా. పార్టీకి, సోదురుడు ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌) మద్దతుగా నిలవాలి. ఈపీఎస్‌ నాయకత్వాని​ బలోపేతం చేయాలి. ఎందుకంటే మనం ప్రజల కోసమే ఉన్నాం’ అని జయలలిత స్వయంగా మాట్లాడినట్లు వాయిస్‌ వచ్చింది.

దీంతో జయలలిత ఏఐ వాయిస్‌ క్లిప్‌ విన్న కార్యకర్తలంతా తమ అధినేత్రి జీవించి ఉన్నట్లుగానే అనిపించిందని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌) 2022లో ఏఐఏడీఎంకేకు నాయకత్వం వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం పార్టీ నుంచి తొలగించబడిన అనంతరం  ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌) పార్టీ చీఫ్‌గా కొనసాగుతున్నారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)