Breaking News

ఆ ఘటన యావత్ సమాజానికి ఒక హెచ్చరిక

Published on Mon, 01/26/2026 - 20:35

ఆర్టిఫిషియల్ ఇం టెలిజెన్స్ టెక్నా లజీ దుర్వి నియోగం ప్రపంచవ్యాప్తంగా పెనుముప్పుగా మారుతోంది. కేవలం సాంకేతిక ఆవిష్కరణగా భావించిన AI... మోసగాళ్ల చేతిలో ఓ ఆయుధంగా మారగా... బాధితులు... సామాన్యులకు మాత్రం ప్రాణం సంకటంగా మారుతోంది. వ్యక్తిగత రహస్యాలు... వారి గోప్య త... ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసే ప్రమాదకర సాధనం గా రూపాంతరం చెందిం ది. ఈ కొత్త రకం సైబర్ నేరాలు మన దేశంలోనూ కలకలం సృ ష్టిస్తున్నా యి.
ఇటీవల చోటు చేసుకుంటున్న విభిన్నమైన కేసులు AI ఆధారిత మోసాల గురించి జాగ్రత్తలు పాటించడం.. వాటి గురించి అవగాహన కలిగి ఉండటం ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి.

కేరళలో ఓ ప్రొఫెసర్‌కు వీడియో కాల్‌ వచ్చింది. సాధారణ కాల్‌ అని వీడియో ఆన్‌ చేశారు... అందమైన అమ్మాయి ప్రత్యక్షమైంది.. వీడియో ద్వారా సంభాషణ సాగిస్తూ... ఆయనను ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది. ఆయన వాస్తవాన్ని మరిచి ఊహాలోకాల్లోకి వెళ్లిపోయారు... సీన్‌ కట్‌ చేస్తే... ఆయన నగ్న వీడియోలు.. అమ్మాయితో మాట్లాడుతున్న సంభాషణ ఆయన ఫోన్‌కే వచ్చాయి. అసలు అది అమ్మాయి కాదు AI సృష్టించిన బొమ్మ అని తెలిసి... ప్రొఫెసర్‌ మాత్రం ఘోరంగా మోసపోయాడు. మోసగాళ్లకు రూ. 2 లక్షలు ఇచ్చిన తర్వాత వేధింపులు ఆగక పోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

గతేడాది ఢిల్లీలో విద్యార్థినుల ఫొటోలను న్యూ డ్‌గా మార్ఫ్ చేయడం.... 
ఛత్తీస్‌గఢ్‌ ఐఐఐటీ విద్యార్థి.... 36 మం ది అమ్మాయిల ఫొటోలను మార్చి వాటిని వైరల్‌ చేసిన కేసు..
అస్సాం లో ఇంజినీర్ ఆన్‌లైన్‌లో నకిలీ న్యూ డ్ కంటెం ట్ సృ ష్టిం చి డబ్బు సం పాదిం చిన విధానాలు చూస్తుంటే 
సాంకేతికతను అడ్డం పెట్టుకుని ఎలా మోసం చేస్తున్నారో గమనించవచ్చు.

AI దుర్వి నియోగం ఎంతటి మానసిక క్షోభకు గురి చేస్తుందో హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఘటన దేశాన్ని కుదిపేసింది. 19 ఏళ్ల డిగ్రీ
విద్యార్థి... తన ముగ్గురు సోదరీమణులకు సంబంధించిన   ఏఐ సృష్టించిన అశ్లీల ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు గురై.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇలా ఒకటి రెండు ఘటనలు మాత్రమే కాదు... నిత్యం కొన్ని వందల సంఖ్యలో బాధితులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మోసాల బారిన పడుతున్నారు. 

ఇలాంటి మోసాల నుంచి బయట పడాలంటే ప్రజలు... 
సమాజం సమష్టిగా కృ షి చేయాల్సిన అవసరం ఉంది. ఏఐ దుర్వినియోగం చేసిన వారిని గుర్తించి కఠిన శిక్షలు విధించాలి. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. 
యువతలో డిజిటల్ భద్రత, ప్రైవసీ, సైబర్ నేరాలపై తప్ప నిసరిగా అవగాహన పెంచాలి.
సోషల్‌ మీడియాలో కంటెంట్ తొలగిం పు వ్య వస్థ ఉండాలి. 
సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ లు తమ వేదికలపై AI-జనరేటెడ్ అభ్యంతరకర కంటెంట్‌ను గుర్తిం చి, వెం టనే తొలగించేం దుకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
బాధితులకు మద్దతుగా సహాయ కేంద్రాలు ఏర్పా టు చేయాలి. 
బాధితులకు మానసిక, చట్టపరమైన సహాయం
అం దిం చే కేం ద్రాలను ఏర్పా టు చేయాలి. మహిళలు ఎటువం టి భయం లేకుండాఫిర్యా దు చేసే వాతావరణాన్ని కల్పించాలి.
ఫరీదాబాద్‌ ఘటప యావత్ సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది... 
టెక్నా లజీ మనిషి జీవితాన్ని మెరుగుపరచాలి....

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)