ఎలా బతికానో కూడా తెలియదు

Published on Fri, 06/13/2025 - 12:29

అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మొత్తం 265 మందికి(ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారం) మరణించారు. విమానం నుంచి ప్రాణాలతో బయటపడింది రమేష్‌ ఒక్కడే. ప్రస్తుతం సివిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రధాని మోదీ పరామర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. మరికొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఆయన నుంచి వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. 

.. ‘‘నమ్మలేకపోతున్నా.. ఎలా బతికానో కూడా తెలియట్లేదు’’ అంటూ అతను చెబుతున్నాడు. విమానంలో 11ఏ సీట్‌లో కూర్చున్న రమేష్‌.. ఎమర్జెన్సీ విండో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారంటూ తొలుత పోలీసులు చెప్పారు. అతని సోదరుడు ధీరేంద్ర సోమ్‌బాయ్‌ కూడా అదే స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అయితే రమేష్‌ మాత్రం జరిగింది అది కాదని స్పష్టత ఇచ్చారు. 

అంతా క్షణాల్లో జరిగిపోయిందని, తమ విమానం నేలకూలుతుందన్న విషయం తనకు అర్థమైంది. ఆ వెంటనే విమానం కిందకు వచ్చి ముక్కలై.. పేలిపోయిందని.. ప్రమాద క్షణాలను గుర్తు చేసుకున్నారు.

40 ఏళ్ల బ్రిటిష్‌ ఇండియన్‌ అయిన విశ్వాష్‌ కుమార్‌ రమేష్‌.. ఏదో అద్భుతం జరిగినట్లే ప్రమాదం నుంచి బయటడ్డారు. ప్రమాద సమయంలో విమానం నేలను తాకి రెండు ముక్కలైంది. ఆ సమయంలో సీటు ఎగిరి కాస్త దూరం పడిపోయింది. ఈ క్రమంలోనే నాకు గాయాలయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో అసలు ఎలా బతికానో కూడా తెలియదు అని రమేష్‌ ప్రధాని మోదీ సహా తనను పలకరించిన వారికల్లా చెబుతున్నాడు.

‘‘ప్రమాదం జరిగాక నేను బతకడం కష్టమనే అనుకున్నా. అయితే నా సీటు దగ్గర్లో  విమాన ప్రధాన భాగం ఉందని కనిపించింది. అక్కడ కొంచెం సందు కనిపించింది. నా సీటు బెల్ట్‌ను నెమ్మదిగా తొలగించి.. పాకుంటూ బయటకు వచ్చా. నా చుట్టుపక్కల వాళ్లలో కొందరు చనిపోయి ఉన్నారు. కొందరికి ఊపిరి ఆగిపోతున్న పరిస్థితి. అది చూశాక.. ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చాక.. విమానం పేలిపోయిందని ఏదో భాషలో(గుజరాతీ) అంతా అరుస్తున్నారు. ఆ గందరగోళ వాతావరణంలోనే నడుచుకుంటూ వచ్చి ఆంబులెన్స్‌ ఎక్కాను’’ అని రమేష్‌ తెలిపారు. ప్రస్తుతం కోలుకుంటున్న రమేష్‌ను.. త్వరలో పోలీసులు, దర్యాప్తు కమిటీ ప్రశ్నించే అవకాశం ఉంది. 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)