Breaking News

సబ్మరతి జైల్లో ఉగ్రవాది అహ్మద్‌పై దాడి.. ఆస్పత్రికి తరలింపు

Published on Wed, 11/19/2025 - 15:03

గుజరాత్‌లో ఉగ్ర కుట్రకు సూత్రధారి, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌పై దాడి జరిగింది. ప్రస్తుతం అహ్మదాబాద్‌ శివారులోని సబర్మతి జైలులో ఉన్న అతడిపై తోటి ఖైదీలు దాడి చేసి చితకబాదారు. ఈ దాడిలో అతని ముఖానికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. 

జోన్‌ 2 డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. అహ్మద్‌ సయ్యద్‌ను జైల్లోని హైసెక్యూరిటీ సెల్‌లో ఉంచారు. అయితే ఈ కేసులో తనతో పాటే అరెస్టైన  అజాద్‌, సుహాయిల్‌తో సయ్యద్‌ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో ముగ్గురు ఖైదీలు అనిల్‌ కుమార్‌, శివమ్‌ శర్మ, అంకిత్‌ లోడీ జోక్యం చేసుకుని సయ్యద్‌పై ఓ కర్రతో దాడికి దిగారు.  

ఈ దాడిలో సయ్యద్‌ ముఖానికి గాయాలు కావడంతో చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు చెందిన ఓ బృందం సబర్మతి జైలుకు చేరుకుంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంది. దాడికి పాల్పడిన ఖైదీలు ఒకరు హత్య కేసులో నిందితుడు కాగా.. మరొకర ఆర్థిక నేరంలో, ఇంకొకరు పోక్సో కేసులో శిక్ష అనుభవిస్తున్నారుఅసలు దాడి ఎందుకు జరిగిందనే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ నెల అనగా నవంబర్ 8న, గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో హైదరాబాద్‌ నగరానికి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. మొహియుద్దీన్.. ఐసీస్‌కు చెందిన ఓ డిపార్ట్‌మెంట్ అయిన.. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)కు చెందిన ఉగ్రవాదిగా దాదాపు నిర్ధారణ అయ్యింది. 

ఆముదం గింజల నుంచి విషం తయారు చేసి.. దాన్ని ప్రసాదంలో కలిపి.. అమాయకుల ప్రాణాలు తీయాలని భావించిన మొహియుద్దీన్ స్కెచ్‌ గీశాడు. చైనాలో ఎంబీబీఎస్ చదవిన మొహియుద్దీన్.. అబుల్ ఖాదీమ్ ఆదేశాల మేరకు ఆముదం గింజల నుంచి ప్రమాదకరమైన రైసిన్ అనే ప్రమాదకరమైన విషాన్ని తయారు చేయడానికి ఇంట్లోనే అన్ని పరికరాలు ఏర్పాటు చేసుకున్నాడు. 

అహ్మదాబాద్ ఏటీఎస్ అహ్మద్‌తో పాటు అరెస్టైన మరో ఇద్దరిని విచారించింది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొహియుద్దీన్.. మరో ఉగ్రవాది అబూ ఖాదీమ్ ఆదేశాల మేరకు పని చేస్తుంటాడని విచారణలో తెలిసింది. అబూ ఖాదీమ్ పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఉండి ఈ మాడ్యూల్‌ను నడిపిస్తున్నాడని.. దర్యాప్తులో వెల్లడైంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)