Breaking News

పెళ్లయ్యి ఆరునెలలే.. వాలెంటైన్స్‌డే రోజే హత్య

Published on Tue, 02/17/2026 - 15:38

అనుమానమే పెనుభూతమైంది. ఫలితం వాలెంటైన్స్ డే వేడుక దారుణ  హత్యకు దారి తీసింది. ఆ తరువాత తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు దోపిడీ నాటకం ఆడాడు. అనుమానం వచ్చిన పోలీసులు కూపీ లాగితే అసలు విషయం బైటపడింది. స్టోరీ ఏమిటీ అంటే..

హర్యానాలోని బహదూర్‌గఢ్‌కు చెందినచార్టర్డ్ అకౌంటెంట్ అన్షుల్ ధావన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉద్యోగి మహాక్‌  ఇద్దరూ దంపతులు. ఆదివారం రాత్రి 11:00 గంటల ప్రాంతంలో, గురుగ్రామ్‌లో పనిచేస్తున్న అన్షుల్, గుర్తుతెలియని దుండగులు తమను దోచుకోవడానికి ప్రయత్నించారని తన భార్య గొంతు కోశారని పోలీసులకు ఫోన్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్షుల్‌ చెబుతున్న దాంట్లో ఏదో తేడా ఉందని గమనించారు. దీంతో పలు విధాలుగా ప్రశ్నించారు. అతను పొంతన లేని సమాధానాలు విన్న తరువాత పోలీసుల అనుమానం మరింత బలపడింది. దీనికి తోడు మహక్ తండ్రి కృష్ణ కతురియా కూడా తన అల్లుడిపై అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్‌

చివరికి మహాక్‌ హత్య వెనుక ఉన్నరహస్యాన్ని ఝజ్జర్ పోలీసులు కేవలం 18 గంటల్లోనే ఛేదించారు.   మొదటినుంచి భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అన్షుల్ చేసిన దారుణమైన పథకంగా తేల్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తానే భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు అన్షుల్‌.

పోలీసుల వివరాల ప్రకారం భార్యను ప్రేమికుల రోజునే మట్టు బెట్టాడు. సాయంత్రం దాకా భార్యతో ఎంతో సంతోషంగా ఉన్నట్టు నటించి  భార్యను గొంతు కోసి చంపేశాడు. వేలిముద్రలు పడకుండా ఉండటానికి చేతి తొడుగులు ధరించాడు. గురుగ్రామ్‌లోని HDFC బ్యాంక్‌లో పనిచేసే మహక్‌పై నుమానం పెంచుకున్నాడని, ఇదే వారిద్దరి మధ్య తరచూ గొడవలకు దారితీసిందని పోలీసులు తెలిపారు. ఆ అనుమానమే చివరికి అతన్ని నేరగాడిగా ​మార్చేసింది. గత సంవత్సరం సెప్టెంబర్ 25న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు గర్భవతి కూడా అని తెలుస్తోంది.

ఇదీ చదవండి: కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)