యువ క్రికెటర్‌ బలి : ఇంత ప్రమాదమా ఈ వ్యాధి? లక్షణాలేంటి?

Published on Wed, 07/08/2026 - 16:24

Shapoor Zadran ఆఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్(38) అకాల మరణం క్రికెట్‌ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అరుదైన, ప్రాణాంతక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు మిగిలి ఉండగానే చిన్న వయసులోనే కన్ను మూశాడు. అసలేంటీ వ్యాధి? తెలుసుకుందాం.

'హీమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసైటోసిస్' ((Hemophagocytic Lymphohistiocytosis) అనే వ్యాధితో చికిత్స పొందుతూ  జద్రాను మరణించాడని  ప్రకటించిన   ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) తీవ్ర విచారాన్ని వెలిబుచ్చింది. ఆఫ్గానిస్తాన్ క్రికెట్ ఎదుగుదలలో, దేశ క్రికెట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో షాపూర్ జద్రాన్ అందించిన సేవలు, నిబద్ధత ఎనలేనివంటూ బోర్డు అతనికి నివాళులర్పించింది.

HLH అంటే ఏంటి? లక్షణాలు, చికిత్స

ఇది చాలా అరుదైన, తీవ్రమైన రోగనిరోధక వ్యవస్థ (Immune System) రుగ్మత. సాధారణంగా మన రోగనిరోధక వ్యవస్థ బాక్టీరియా, వైరస్‌ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. కానీ, ఈ వ్యాధి సోకినప్పుడు రోగనిరోధక వ్యవస్థ చాలా యాక్టివ్ అయి పోతుంది.  ఇన్ఫెక్షన్లపై పోరాడాల్సింది పోయి సొంత శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలాలు, అవయవాలపైనే దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఫలితంగా లివర్, ప్లీహం (Spleen), ఎముక మజ్జ (Bone Marrow), మెదడు వంటి ముఖ్యమైన అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయి.


HLH  రావడానికి  కారణలు
1. సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రుల నుండి వచ్చే జన్యుపరమైన లోపాల వల్ల వస్తుంది. ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది.

2. అలాగే కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్లఈ వ్యాధిసోకవచ్చు.  తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్లు (ఉదాహరణకు ఎప్‌స్టీన్-బార్ వైరస్), లూపస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులు లేదా బ్లడ్ క్యాన్సర్ (లింఫోమా, ల్యుకేమియా) వంటి వాటి వల్ల ఇది రావచ్చు.

ముఖ్యలక్షణాలు

  • దీని లక్షణాలు సాధారణ ఇన్ఫెక్షన్ల లాగే ఉండటం వల్ల మొదట్లో గుర్తించడం కష్టం.

  • తగ్గని తీవ్రమైన జ్వరం, తీవ్రమైన అలసట, బలహీనత

  • కాలేయం (లివర్), ప్లీహం వాపునకు గురవడం

  • చర్మంపై దద్దుర్లు, సులభంగా రక్తస్రావం కావడం లేదా వాతలు పడటం

  • రక్తహీనత  వల్ల చర్మం తెల్లబడటం లేదా కామెర్లు (Jaundice) రావడం

  • తీవ్రమైన సందర్భాల్లో ఫిట్స్ (Seizures) రావడం లేదా మతిస్థిమితం తప్పడం.

వ్యాధి నిర్ధారణ , చికిత్స
ఈ వ్యాధి సోకిందని నిర్ధారించేకు  కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కేవలం ఒకే ఒక పరీక్షతో దీనిని నిర్ధారించలేరు. రక్తం లోని కణాల సంఖ్య, ఫెర్రిటిన్ (Ferritin) స్థాయిలు, లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు, మరియు బోన్ మ్యారో  పరీక్షల ద్వారా వైద్యులు దీనిని గుర్తిస్తారు.

మితిమీరిన రోగనిరోధక శక్తిని అదుపు చేయడానికి కార్టికోస్టెరాయిడ్స్, కీమోథెరపీ మందులు, ఇమ్యునోథెరపీ ఇస్తారు. ఇన్ఫెక్షన్ల నివారణకు యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. జన్యుపరమైన సమస్య ఉన్నవారికి లేదా పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి 'స్టెమ్ సెల్ (బోన్ మ్యారో) ట్రాన్స్‌ప్లాంటేషన్' మాత్రమే ఏకైక మార్గం.

ఇదీ చదవండి: రెడ్‌ బెనారసీ డ్రెస్‌లో పార్టీ లుక్‌.. తొలిసారి ఇలా అన్షులా!

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)