వైరల్‌ ఫొటో.. ప్రధాని మోదీ వెనుకనున్న అదాసో కపేసా ఎవరంటే..

Published on Tue, 08/12/2025 - 09:31

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల యూకేలో పర్యటించారు. ఈ సందర్భంగా నలుపురంగు సూట్‌ ధరించిన ఒ​క మహిళా అధికారి ప్రధాని మోదీకి రక్షణగా నిలిచిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. ఈ నేపధ్యంలో ఆమె ఎవరనే చర్చ ఇంటర్నెట్‌లో మొదలయ్యింది. ఆమె ఎవరో, ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏమిటో తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.

వైరల్‌ ఫొటోలో ప్రధాని మోదీ వెనుక రక్షణగావున్న ఆ మహిళా అధికారి పేరు అదాసో కపేసా. ప్రధాని రక్షణ బాధ్యతలు వహించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ)లో పనిచేస్తున్న మొట్టమొదటి మహిళ ఆమె. అదాసో కపేసా మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలోని కైబి గ్రామానికి చెందిన మహిళ. స్థానిక పాఠశాలలో చదువు పూర్తి చేసిన అనంతరం ఆమె సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ)లో చేరారు. ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్‌లోని 55వ బెటాలియన్‌లో విశిష్ట సేవలందించారు. ఆమె తన పనితీరుతో సీనియర్ అధికారుల నుండి  అభినందనలు అందుకున్నారు. ఎంతో కఠినమైన కమాండో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ఆమె ఎస్‌పీజీకి ఎంపికయ్యారు.

ఎస్‌పీజీ అనేది దేశంలోని అత్యంత ఉన్నత భద్రతా విభాగం. ఇది ప్రధాని, అతని కుటుంబ సభ్యులకు గట్టి భద్రత కల్పిస్తుంది. ఎస్‌పీజీలో ఎంపిక కావాలంటే ఆయుధ శిక్షణ, యుద్ధ కళలు, బాంబు నిర్వీర్యం  తదితర అంశాలలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో పలు శారీరక, మానసిక పరీక్షలను  ఎదుర్కోవలసి ఉంటుంది.  అదాసో కపేసా 2020లో ఎస్‌పీజీ కమాండో శిక్షణను పూర్తి చేసి, 2024లో ప్రధాని ప్రధాన భద్రతా బృందంలో చేరారు. ఇంతటి అత్యున్నత బాధ్యతలు చేపట్టిన అదాసో కపేసా మహిళలకు స్ఫూర్తినందిస్తున్నారు.

1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సొంత అంగరక్షకులే హత్య చేసిన దరిమిలా 1985లో ఎస్‌పీజీ ఏర్పాటయ్యింది. ప్రధాని రక్షణ బాధ్యత ఎస్‌పీజీ అధికారులపై ఉంటుంది. ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర సీమా బల్ తదితర సాయుధ విభాగాల నుండి ఎస్‌పీజీ సిబ్బందిని నియమిస్తారు. భారతదేశ భద్రతా వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరిగిందనడానికి  అదాసో కపేసా ఒక ఉదాహరణగా నిలిచారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)