Breaking News

పాఠ్యాంశంగా నటి తమన్నా జీవితం!!

Published on Fri, 06/28/2024 - 08:42

సాక్షి బెంగళూరు: సినీ నటి తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేయడంపై బెంగళూరులో విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. హెబ్బాళలోని సింధీ ఉన్న­త పాఠశాలపై బాలల హక్కుల రక్షణ సంఘానికి వారు ఫిర్యాదు చేశారు. 

పాఠశాలలోని ఏడో తరగతి విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఏడో చాప్టర్‌లో సింధీ వ్యక్తుల గురించి అంశాన్ని పొందుపరిచారు. ఇందులో నటి తమన్నా భాటియా, నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ గురించి పాఠ్యాంశంగా చేర్చారు. పలు చిత్రాల్లో అర్ధ­నగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని తల్లిదండ్రు­లు మండిపడ్డారు. సింధీ సామాజికవర్గంలో ఎంతో మంది కళాకా­రు­లున్నారని, వారి గురించి పాఠ్యాంశంగా ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. దీన్ని వ్యతిరేకించినందుకు తమ పిల్లలకు టీసీ ఇస్తామని పాఠశాల యాజ­మాన్యం బెదిరిస్తున్నట్లు తెలిపారు. 

తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం బుజ్జగిస్తోంది. అదొక పాఠ్యేతర అంశంగా చేర్చినట్లు, అందులో తమన్నా పాఠాలను ఇచ్చినట్లు తెలిపింది. స్వాతంత్య్రం అనంతరం సింధూ ప్రాంత విభజన అనంతరం ఆ సామాజిక వర్గ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయనే విష­యం విద్యార్థులకు తెలియజేసేందుకు పాఠ్యాంశంగా ముద్రించినట్లు తెలిపింది. సింధీ సామాజికవర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజ­యాలు సాధించడంతో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చినట్లు తెలిపింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)