Breaking News

యాసిడ్‌ దాడి జరిగిన 28 ఏళ్లకు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం

Published on Sun, 10/26/2025 - 06:51

షాజహాన్‌పూర్‌: పెళ్లిని రద్దు చేసుకున్నారనే కోపంతో ఓ యువకుడు, వధువు కావాల్సిన 15 ఏళ్ల బాలిక ముఖంపై యాసిడ్‌ పోశాడు. ఈ ఘోరం 1997 అక్టోబర్‌ 28వ తేదీన యూపీ రాజధాని లక్నోలోని సదర్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక ముఖమంతా కాలిపోయింది. చూపుమందగించింది. నేరానికి గాను పప్పు అనే నిందితుడికి జైలు శిక్ష పడింది. అయితే, బాధితురాలిది తీరని వ్యథ అయ్యింది. అప్పట్నుంచి ఆమె ముఖానికి పలు శస్త్రచికిత్సలు జరిగాయి. 

టైలర్‌గా పనిచేసే తండ్రి సంపాదించిందంతా ఆమె కోసమే ఖర్చు చేశాడు. అనంతర కాలంలో తల్లి,తండ్రి చనిపోయారు. తోబుట్టువులు వదిలేశారు. ఒంటరిగా బతుకు లాగుతోంది. ఆమె తరఫున బ్రేవ్‌ సౌల్స్‌ ఫౌండేషన్‌ అనే ఎన్జీవో పోరాడుతోంది. యాసిడ్‌ దాడి బాధితురాలికి అవసరమైన సాయం అందజేయాలని అధికారులు, నేతల చుట్టూ ఆ సంస్థ వ్యవస్థాపకురాలు షహీన్‌ మాలిక్‌ తిరుగుతూనే ఉన్నారు. 

బాధితురాలికిప్పుడు 43 ఏళ్లు. ఎట్టకేలకు, 28 ఏళ్లకు ఇటీవలే యూపీ ప్రభుత్వం రూ.4 లక్షలు అందజేసింది. కేంద్రం నుంచి గతేడాది రూ.లక్ష బాధితురాలికి అందాయి. అయితే, తాము న్యాయం కోసం హైకోర్టుకు వెళతామని, బాధితురాలికి రూ.50 లక్షలు పరిహారం అందించాలని కోరుతామని షహీన్‌ తెలిపారు. బాధితురాలు ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నారన్నారు. ‘నా ముఖంతోపాటు జీవితం కూడా ఒక్క క్షణంలోనే నాశనమైపోయాయి. నా తల్లిదండ్రులు ఇప్పుడు లేరు. సోదరులు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడిక కేవలం గౌరవంగా బతకాలని కోరుకుంటున్నా’అని బాధితురాలు ఆవేదన చెందుతున్నారు. 
 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)