Breaking News

రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 474 మంది బలి

Published on Mon, 10/21/2024 - 05:36

సాక్షి, న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సగటున రోజుకు 474 మంది చనిపోయారని, ప్రతీ మూడు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వం డేటా సేకరణలో ఆందోళనకరమైన గణాంకాలు వెలుగు చూశాయి. కాగా, గతేడాది రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తెలంగాణలో బాగా పెరిగిపోయింది.

ఇదిలా ఉండగా..2023 ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.73 లక్షలకు పైగా మరణించారు. ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం (హెల్మెట్‌) ధరించకపోవడం వల్ల 70% మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రాలు ఈ గణాంకాలను కేంద్ర ప్రభుత్వానికి అందించాయి. రోడ్డు ప్రమాదాల కారణాలు, తీవ్రతను అర్థం చేసుకోవడానికి కేంద్రం డేటాను సేకరించడం ప్రారంభించినప్పటి నుంచి ఈ ఏడాదే అత్యధిక మరణాలు సంభవించాయి.  

గతేడాది క్షతగాత్రులు 4.63 లక్షలు 
గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 4.63 లక్షల మంది గాయపడ్డారు. దీంతో రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల సంఖ్య పెరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇది 2022 కంటే 4% ఎక్కువ. 2022లో రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది చనిపోయారని కేంద్ర రోడ్డు రవాణా శాఖ నివేదికలో పేర్కొన్నారు. ఎన్‌సీఆర్‌బీ ప్రకారం 2022లో రోడ్డు ప్రమాదాల్లో 1.71 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ రెండు ఏజెన్సీలు 2023కి సంబంధించిన గణాంకాలను విడుదల చేయలేదు. 

ప్రమాద మరణాల్లో తొలిస్థానంలో ఉత్తరప్రదేశ్‌.. 
యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు, పశి్చమ బెంగాల్, పంజాబ్, అస్సాం, తెలంగాణ సహా 21 రాష్ట్రాల్లో 2022తో పోలిస్తే 2023లో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్, బిహార్, ఢిల్లీ, కేరళ, చండీగఢ్‌ వంటి రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కాగా గతేడాది రోడ్డు ప్రమాదాల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 23,652 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడులో 18,347మంది, మహారాష్ట్రలో 15,366 మంది మరణించారు.  

క్షతగాత్రుల్లో తమిళనాడు తొలిస్థానం 
రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారిలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ రోడ్డు ప్రమాదాల్లో 72,292 మంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లో 55,769 మంది, కేరళలో 54,320 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారు. కాగా, గతేడాది మరణించిన వారిలో 44% మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. అలాగే గతేడాది మరణించిన ద్విచక్ర వాహనదారుల్లో 70% మంది హెల్మెట్‌ ధరించని కారణంగా మృత్యువాతపడ్డారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)