Breaking News

‘కేజ్రీవాల్‌.. ఇది చాలా సీరియస్‌ ఆరోపణ.. విచారణకు సిద్ధంకండి’

Published on Fri, 02/07/2025 - 19:33

న్యూఢిల్లీ:  ‘కేజ్రీవాల్‌.. మీరు విచారణకు సిద్ధంగా ఉండండి. మీరు చేసిన ఆరోపణ  చాలా పెద్దది.  ఇందులో నిజా నిజాలు నిగ్గు తేల్చాలి. మీరు విచారణకు అందుబాటులో ఉండాలి’ అంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులిచ్చింది.

తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ(BJP) రూ. 15 కోట్ల ఆఫర్‌ ఇవ్వడమే కాకుండా వారికి మంత్రి పదవులు ఆశ చూపిందని కేజ్రీవాల్‌ ఈరోజు(శుక్రవారం) ఆరోపించారు. దీనిపై తన సోషల్‌  మీడియా ‘ఎక్స్‌’లో కేజ్రీవాల్‌ సుదీర్ఘమైన  పోస్టుపెట్టారు.  ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ..ఢిల్లీ లెఫ్టనెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు లేఖ రాసింది. దీనిపై విచారణకు ఆదేశించాలని బీజేపీ లేఖ ద్వారా కోరింది.

దాంతో వీకే సక్సేనా.. ఢిల్లీ ఏసీబీని విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌కు ముందుగా నోటీసులిచ్చింది ఏసీబీ.  ఐదు ప్రశ్నలతో కూడిన  నోటీసులు ఇచ్చింది. ‘ మీరు చేసిన ఆరోపణలపై విచారణకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్న ఏసీబీ.. ఐదు ప్రశ్నలను కేజ్రీవాల్‌ ముందు ఉంచింది.

ఏసీబీ నోటీసులో పేర్కొన్న ఐదు ప్రశ్నలు ఇవే..

1. మీ ఎక్స్‌ ఖాతాలో  పోస్ట్‌ చేసిన ట్వీట్‌ ీమీరు చేసిందేనా?.. లేక ఇంకెవరి ప్రమేయమైనా ఉందా?

2.  మీ 16 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం జరిగిందని చేసిన ట్వీట్‌తో మీరు ఏకీభవిస్తారా?

3.  ఎవరైతే ఫోన్‌ కాల్‌ ద్వారా రూ. 15 కోట్ల ఆఫర్‌ పొందారో.. వారి వివరాలు మాకివ్వండి

4,  మీ ఎమ్మెల్యేలకు ఎవరైతే ఆఫర్‌ చేశారో వారి వివరాలు ఇవ్వండి.  వారి వ్యక్తిగత వివరాలు కానీ, వారి ఫోన్‌ నంబర్లు కానీ  మాకు ఇవ్వండి.

5.  మీరు ేచేసిన ఆరోపణలపై మీ వద్ద ఇంకా ఏమైనా ఆధారాలుంటే మాకు సమర్పించండి.

రేపు(శనివారం) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న తరుణంలో కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలు ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యాయి.  కేజ్రీవాల్‌ కావాలనే బీజేపీపై ఆరోపణ చేశారా.. లేక నిజంగా బీజేపీ కొనుగోలు చేయడానికి యత్నించిందా అనేది విచారణలో తేలనుంది. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)