Breaking News

గ్యాంగ్‌స్టర్‌ అబూ సలేంకు షాక్‌.. రెండు రోజులే పెరోల్

Published on Wed, 01/14/2026 - 09:43

ముంబై: మహారాష్ట్రలోని ముంబై వరుస పేలుళ్ల కేసు(1993)లో దోషిగా తేలిన గ్యాంగ్‌స్టర్ అబూ సలేంను అంతర్జాతీయ నేరస్థునిగా మహారాష్ట్ర ప్రభుత్వం అభివర్ణించింది. తన సోదరుడి మరణానంతరం నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అబూ సలేం 14 రోజుల పెరోల్ కోరగా, ప్రభుత్వం దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. అతను అత్యంత ప్రమాదకర వ్యక్తి  అని, కేవలం రెండు రోజుల అత్యవసర పెరోల్ మాత్రమే మంజూరు చేయగలమని కోర్టు స్పష్టం చేసింది. అది కూడా పోలీసు బందోబస్తు మధ్యే సాధ్యమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంఖువర్ దేశ్‌ముఖ్ బాంబే హైకోర్టుకు  తెలిపారు.

జైలు నిబంధనల ప్రకారం సలేంకు పోలీసు ఎస్కార్ట్‌తో కూడిన రెండు రోజుల పెరోల్ ఇచ్చేందుకు జైలు అధికారులు సుముఖత వ్యక్తం చేశారని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ భద్రతా ఏర్పాట్లకు అయ్యే ఖర్చును అబూ సలేం స్వయంగా భరించాలని షరతు విధించింది. దీనిపై సలేం తరపు న్యాయవాది ఫర్హానా షా స్పందిస్తూ, ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు వెళ్లి రావడానికి రెండు రోజులు సరిపోవని వాదించారు. అతను గత రెండు దశాబ్దాలుగా జైలులోనే ఉన్నాడని, అతను భారతీయ పౌరుడేనని పేర్కొంటూ, పోలీసు ఎస్కార్ట్ అవసరం లేదని ఫర్హానా షా కోర్టును కోరారు.

ఈ వివాదంపై విచారణ చేపట్టిన జస్టిస్ అజయ్ గడ్కరీ, జస్టిస్ శ్యామ్ చందక్లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అబూ సలేంకు 14 రోజుల పెరోల్ ఇవ్వడంలో ఉన్న అభ్యంతరాలు, భద్రతాపరమైన ఆందోళనలను వివరిస్తూ, అఫిడవిట్ దాఖలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. గతంలో తల్లి మరణించిన సమయంలో కూడా సలేంకు కొద్దిరోజుల పెరోల్ లభించిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది.

అబూ సలేం సోదరుడు అబూ హకీం అన్సారీ 2025, నవంబర్‌లో మరణించారు. నాడు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సలేం 14 రోజుల పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోగా, నవంబర్ 20న జైలు అధికారులు దానిని తిరస్కరించారు. కోర్టుకు క్రిస్మస్ సెలవులు ఉండటంతో తన పిటిషన్ ఆలస్యమైందని సలేం డిసెంబర్ 2025లో హైకోర్టును ఆశ్రయించారు. 2005లో అరెస్ట్ అయినప్పటి నుండి జైలులోనే ఉన్న తనకు, తన కుటుంబ సభ్యుల మరణానంతర కార్యక్రమాలకు హాజరయ్యే హక్కు ఉందని సలేం తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రంలో బంగారు నిక్షేపాలు.. తవ్వాలంటే..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)