Breaking News

అభిషేక్ బెనర్జీకి హైకోర్టు షాక్‌.. కంటి చికిత్సకు సలహా!

Published on Tue, 07/21/2026 - 08:46

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ కంటి చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ తోసిపుచ్చింది. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విద్వేష ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై ఆయనపై నమోదైన కేసు విచారణ సందర్భంగా ఈ అభ్యర్థన తెరపైకి వచ్చింది.

న్యాయమూర్తి జస్టిస్ సౌగత భట్టాచార్య ఈ విజ్ఞప్తిని తిరస్కరించి, కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్ఎస్‌కేఎం మెడికల్ కాలేజీ వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. గత పదేళ్లుగా అమెరికాలో కంటి చికిత్స పొందుతున్నట్లు బెనర్జీ తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న కీలక కేసుల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ ఈ విదేశీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించారు.

దీంతో ఎస్ఎస్‌కేఎం ఆస్పత్రి నేత్ర వైద్య విభాగం అధిపతితో ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి, వారి నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంలో తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా పడింది. అయితే, విద్వేషపూరిత ప్రసంగాల కేసుకు సంబంధించి అక్టోబరు వరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ, దర్యాప్తునకు సహకరించాలని కోర్టు ఆదేశించింది.

ఇది కూడా చదవండి: పాక్‌లో మరింత పేదరికం.. ప్రతి10 మందిలో ముగ్గురు..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)