Breaking News

‘కేజ్రీవాల్‌ ఆరోగ్యం క్షీణిస్తోంది.. జైలులో 4.5 కేజీల బరువు తగ్గారు’

Published on Wed, 04/03/2024 - 11:38

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌ అభియోగాలు  ఎదుర్కొంటున్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీ (రిమాండ్‌ ఖైదీ)లో భాగంగా తీహార్‌ జైల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ క్రమంలో తిహార్‌ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్‌ ఆరోగ్యం సరిగా లేదని జలవనరుల శాఖ మంత్రి ఆతీశీ అన్నారు. ఆయన అస్వస్థతకు గురయ్యారని.. మార్చి 21న సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 4.5 కిలోల బరువు తగ్గారని ‘ఎక్స్‌ ’వేదికగా ఆమె తెలిపారు.

‘సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రమైన మధుమేహం (డయాబెటిక్స్‌) కలిగి ఉన్నారు. ఆరోగ్య సమ్యలు ఉ‍న్నపటికీ ఆయన దేశం కోసం రోజంతా పని చేస్తున్నారు. అరెస్ట్‌ అయిన దగ్గరి నుంచి కేజ్రీవాల్‌ 4.5 కిలోల బరువు తగ్గారు. ఇది చాలా బాధ కలిగించే విషయం. బీజేపీ కావాలని కేజ్రీవాల్‌ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది. కేజ్రీవాల్‌కు ఏమైనా అయితే దేశమే కాదు.. భగవంతుడు కూడా క్షమించడు’అని మంత్రి ఆతీశీ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే తీహార్‌ జైలు అధికారు ఆతీశీ మాటలపై స్పందిస్తూ.. కేజ్రీవాల్‌ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. రెండు రోజు క్రితం ఆయన తీహార్‌ జైలుకు వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్‌ బరువు తగ్గలేదని  చెప్పారు. అత్యంత భద్రత గల జైలు గదిలో ఆయన్ను ఉంచినట్లు తెలిపారు. అదేవిధంగా కేజ్రీవాల్‌ 55 కేజీల బరువు ఉన్నారు. ఆయన బరువులో ఎలాంటి మార్పు లేదు. ఆయన షుగర్‌ లెవల్స్‌ కుడా నార్మల్‌గానే ఉన్నాయని జైలు అధికారులు తెలిపారు. ఉదయం కేజ్రీవాల్‌ యోగా, మెడిటేషన్‌ చేస్తున్నారని అ‍న్నారు. ఆయకు కేటాయించిన సెల్‌లో కేజ్రీవాల్‌ నడుస్తున్నారని చెప్పారు.

ఇక..ఈడీ కస్టీడీ ముగిసిన అనంతరం అరవింద్‌ కేజీవాల్‌ను సోమవారం జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా తీహార్‌ జైలు పంపిన విషయం తెలిసిందే.  ఆయన జ్యుడీషియల్‌ కస్టడీ ఏప్రిల్‌ 15ను వరకు కొనసాగనుంది.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)