Breaking News

తప్పించుకున్న ఆప్‌ ఎమ్మెల్యే

Published on Wed, 09/03/2025 - 05:50

పటియాలా: పంజాబ్‌లోని అధికార ఆప్‌కు చెందిన ఎమ్మెల్యే నాటకీయ పరిణామాల నడుమ పోలీస్‌ కస్టడీ నుంచి తప్పించుకోవడం సంచలనంగా మారింది. అత్యాచారం కేసు కావడంతో అరెస్ట్‌ చేయడానికి వెళ్లిన పోలీసులపైకి ఆయన అనుచరులు తుపాకులతో కాల్పులు జరుపుతూ, రాళ్లు రువ్వారు. ఇదే అదనుగా ఎమ్మెల్యే పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నారు. హరియాణాలోని కర్నాల్‌ జిల్లా దబ్రి గ్రామంలోని నివాసంలో ఉన్న హర్మీత్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకునేందుకు మంగళవారం పటియాలా పోలీసు బృందం అక్కడికి చేరుకుంది.

అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు ఎమ్మెల్యేను తరలిస్తుండగా కొందరు గ్రామస్తులు పోలీసుల పైకి రాళ్లు రువ్వడంతోపాటు కాల్పులకు దిగారు. ఇదే అదనుగా ఎమ్మెల్యే తప్పించుకున్నారు. ఘటనలో ఒక పోలీసు గాయపడ్డారు. స్కార్పియో వాహనంలో ఎమ్మెల్యే తప్పించుకునే క్రమంలో ఓ పోలీసుపైకి వాహనాన్ని డ్రైవ్‌ చేశారని అధికారులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరుడు బల్వీందర్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకుని మూడు తుపాకులు, ఫార్చునర్‌ కారును స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారయ్యేందుకు ఎమ్మెల్యే వాడిన వాహనాన్ని అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయన కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు.

భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లు నమ్మించి, తనతో హర్‌ప్రీత్‌ సింగ్‌ సంబంధం కొనసాగించాడని జిరాక్‌ పూర్‌కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. అనంతరం 2021లో పెళ్లి చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ప్రైవేట్‌ చిత్రాలు చూపుతూ బెదిరిస్తున్నట్లు ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై రేప్, మోసం తదితర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. వరద సహాయక చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన ఇటీవల పలు ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కల్పించిన వ్యక్తిగత భద్రతను సైతం ఉపసంహరించుకుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)