Breaking News

ఒక కేసులో బెయిల్‌.. గంటల వ్యవధిలో మరో కేసులో ఎమ్మెల్యే అరెస్ట్‌

Published on Wed, 12/04/2024 - 21:23

ఢిల్లీ : ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే దోపిడీ కేసులో షరతులతో కూడిన బెయిల్‌ పొందారు. అలా బెయిల్‌ వచ్చిందో లేదో .. ఇలా మరో కేసులో అరెస్ట్‌ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.    

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ బుధవారం దోపిడీ కేసులో బెయిల్ పొందిన కొన్ని గంటల తర్వాత, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసులో అరెస్టయ్యారు.

ఆదివారం ఢిల్లీ ఉత్తమ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బల్యాన్‌ను మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) నిబంధనల ప్రకారం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

 

అయితే, ఈ అరెస్ట్‌కు ముందే గత శనివారం దోపిడీ కేసులో మూడు రోజుల కస్టడీ గడువు ముగిసిన అనంతరం, అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. దోపిడీ కేసులో రూ.50 వేలు ఫైన్‌ విధిస్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ మరుసటి రోజు ఆదివారం బల్యాన్‌ను దక్షిణ ఢిల్లీలోని ఆర్‌కే పురం క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి విచారణ కోసం వచ్చిన బల్యాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. 

ఎమ్మెల్యేకు బెయిల్‌,అరెస్ట్‌పై బీజేపీ, ఆప్‌ నేతలు విమర్శల దాడికి దిగారు. నేరాలకు పాల్పడుతున్న తన పార్టీ ఎమ్మెల్యేపై అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. అయితే, బీజేపీ విమర్శల్ని ఆప్‌ ఖండించింది. బల్యాన్‌ అరెస్ట్‌ అక్రమమని, బీజేపీ అబద్ధపు ప్రచారం చేసి తమ పార్టీ నేతలపై కేసులు పెట్టిస్తుందని ఆప్‌ నేతలు మండిపడుతున్నారు. 

 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)