Breaking News

మన్‌ కీ బాత్‌ మొత్తం ఎపిసోడ్‌లకు రూ. 830 కోట్లు! ట్వీట్‌ దుమారం

Published on Tue, 05/02/2023 - 09:46

ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌ ప్రోగ్రాం 100వ ఎపిసోడ్‌ను ఆదివారం బీజేపీ చాలా అట్టహాసంగా జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన నెలవారి రేడియో కార్యక్రమం మన కీ బాత్‌ కోసం రూ. 8.3 కోట్లు ఖర్చు అవుతుందని, మొత్తంగా అన్ని ఎపిసోడ్‌లకు కలిపి రూ. 830 కోట్లు ఖర్చుపెట్టారంటూ ఒక ట్వీట్‌ దుమారం రేపింది. ఈ ట్వీట్‌ని గుజరాత్‌ ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకుడు గాధ్వీ చేశారు. దీంతో గాధ్వీపై ఏప్రిల్‌ 29న సైబర్‌ క్రై బ్రాంచ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రభుత్వం తరపును ఫిర్యాదుదారుగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఎలాంటి విశ్వసనీయమైన డేటా లేకుండా గాధ్వి ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఆప్‌ బీజేపిపై ఫైర్‌ అయ్యింది. బీజేపీ రాజకీయ హత్యకు పాల్పడుతూ ఇలా తమ నాయకులపై కేసు నమోదు చేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆప్‌ రాజ్యసభ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి రాఘవ్‌ చద్ధా మాట్లాడతూ..కొత్త రోజు కొత్త ఎఫ్‌ఆర్‌ అంటూ ట్విట్టర్‌లో విమర్శించారు. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. చిన్న రాజకీయ తర్జభర్జన చేసినందుకే గాధ్విపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే..పతకాలు గెలుచుకున్న రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ నాయకుడిని మాత్రం చూసి చూడనట్టు వదిలేశారు ఈ పోలీసులు అంటూ మండిపడ్డారు.

ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద రెజ్లర్లు నిరసనలు చేసినా.. సదరు బీజేపీ నాయకుడిపై కేసు నమోదు చేయలేదని, సుప్రీం కోర్టుని ఆశ్రయించాక పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని చద్ధా గుర్తు చేశారు. ఇదిలా ఉండగా, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) ప్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ గాధ్వీ చేసిన ట్వీట్‌ని అవాస్తవమని, తప్పుదోవ పట్టించేదిగా ఉందని పేర్కొంది.  వాస్తవానికి ఆ వైరల్‌ మెసేజ్‌లో చెప్పినట్లుగా ఒక్క ఎపిసోడ్‌కు రూ. 8.3 కోట్లు కాదని మొత్తం మన్‌కి బాత్‌ ఎపిసోడ్‌ల ప్రకటనల మొత్త ఖర్చు రూ. 8.3 కోట్లని వెల్లడించింది. ప్రతి ఎపిసోడ్‌కు ప్రకటనల మద్దతు ఉందని ఊహిస్తోంది అది తప్పు అని పీఐబీ పేర్కొంది. 

(చదవండి: బతికే ఉన్నా, పెళ్లైంది అంటూ సీఎం, డీజేపీలకి లేఖ..తీరా చూస్తే ఆ వ్యక్తి..)

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)