Breaking News

ఢిల్లీ మేయర్‌ పీఠం ఆప్‌దే.. స్వల్ప తేడాతో బీజేపీపై విజయం

Published on Thu, 11/14/2024 - 20:46

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మేయర్‌ పీఠాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ మహేశ్‌ కుమార్‌ ఖించి కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి కిషన్‌లాల్‌పై స్వల్ప ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. కరోల్‌బాగ్‌లోని దేవ్‌నగర్‌ కౌన్సిలర్‌గా ఉన్న మహేశ్‌ ఖించికి 133 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 130 ఓట్లు వచ్చాయి. కేవలం మూడు ఓట్ల తేడాతో ఆప్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.

కాగా ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నిక గురువారం ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు సభ్యలు వాకౌట్‌ చేయడంతో ఆప్‌-బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. మొత్తంగా 265 ఓట్లు పోలవ్వగా.. రెండు ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. 

బీజేపీకి 120 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉండగా.. మరో 10 ఓట్లు సాధించగలిగింది. దీంతో ఆప్‌ నుంచి కొందరు కార్పొరేటర్లు బీజేపీకి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బీజేకి చెందిన కిషన్‌లాల్‌పై ఆప్‌ కౌన్సిలర్ మహేష్ ఖించి గెలుపొందారు.  

ఈ ఎన్నికల్లో ఆప్‌ ఎంపీలు సంజయ్‌ సింగ్‌, ఎన్‌డీ గుప్తా, బీజేపీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఓటు వేశారు. అయితే ఖించి కేవలం 5 నెలల మాత్రమే మేయర్‌ పీఠంపై కొనసాగనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఆప్‌, బీజేపీ మధ్య పోరుతో పదే పదే వాయిదా పడటమే ఇందుకు కారణం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)