Breaking News

ఓటరు నమోదుకు ఆధార్‌ తప్పనిసరి కాదు: ECI

Published on Thu, 09/21/2023 - 16:56

సాక్షి,  ఢిల్లీ: ఓటరు నమోదుకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం Election Commission of India స్పష్టం చేసింది. ఈ మేరకు ఫారం -6, 6బీ లో అవసరమైన మార్పులు చేస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఓ రిట్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి అండర్‌ టేకింగ్‌ సమర్పించింది ఈసీఐ.

ఇప్పటికే దాదాపు 66,23,00,000 కోట్ల ఆధార్ కార్డులను ఎన్నికల కార్డులతో జత చేశామని తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం.. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోరల్స్ సవరణ రూల్స్  2022 కింద ఆధార్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.

ఎన్నికల గుర్తింపు కార్డులతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జూన్ 2022లో ఓటర్ల నమోదు (సవరణ) రూల్స్ 2022ని నోటిఫై చేసింది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జీ నిరంజన్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై  చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం చేపట్టింది. 

ఎన్నికల సంఘం తరపున సీనియర్‌ న్యాయవాది సుకుమార్‌ పట్టజోషి వాదనలు వినిపించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘం తరపున అండర్‌టేకింగ్‌ను బెంచ్‌కు సమర్పించారు.  అండర్‌ టేకింగ్‌లో.. ఫారం6(కొత్త ఓటర్ల కోసం దరఖాస్తు ఫారం)తో పాటు 6బీ(రిజిస్ట్రేషన్‌ ఇన్‌ ఈ-రోల్‌) అవసరమైన మార్పులు చేస్తమని తెలిపారు. అలాగే. ఓటర్ల నమోదు (సవరణ) రూల్స్ 2022లోని రూల్ 26-బి ప్రకారం ఆధార్ నంబర్‌ను సమర్పించడం తప్పనిసరి కాదని పేర్కొంది. ఈసీఐ అండర్‌ టేకింగ్‌ నేపథ్యంలో.. కోర్టు సదరు రిట్‌ పిటిషన్‌ను డిస్పోజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)