Breaking News

చిరుతపులి దాడి.. మరో చిన్నారి మృతి

Published on Fri, 10/11/2024 - 19:48

లక్నో: చిరుతపులి దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పశుగ్రాసం తీసుకొచ్చేందుకు తల్లితో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లిన బాలికపై.. చిరుత ఒక్కసారిగా  దాడి చేసి.. ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. నహ్తౌర్ ప్రాంతంలోని మల్కాపూర్ గ్రామానికి తాన్య(8) అనే చిన్నారి పశుగ్రాసం సేకరించేందుకు తల్లితో కలిసి ఉదయం 8 గంటల సమయంలో సమీపంలోని  అటవీ ప్రాంతానికి వెళ్లింది.

అయితే అదే సమయంలో చిరుత ఒక్కసారిగా బాలికపై దాడి చేసి.. తాన్యను రోడ్డుపై నుంచి ఈడ్చుకెళ్లింది. వెంటనే చిన్నారి తల్లి, ఇతర గ్రామస్థులు కర్రలతో చిరుతను వెంబడించారు. దీంతో భయపడిన చిరుత.. చిన్నారిని వదిలి వెళ్లిపోయింది. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె తీవ్ర గాయాలతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపినట్లు నహ్తౌర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధీరజ్‌ సింగ్‌ తెలిపారు. 

సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిరుతపులిని గుర్తించడానికి కెమెరా ట్రాప్‌లను, థర్మల్ డ్రోన్‌లను ఉపయోగిస్తున్నట్లు ఫారెస్ట్ డివిజన్ అధికారి పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఇటీవల చిరుత దాడిలో యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)