Breaking News

షాప్‌లో వృద్ధుడి నుంచి రూ.లక్ష దోచుకెళ్లిన కేటుగాళ్లు.. వీడియో వైరల్..

Published on Tue, 06/27/2023 - 16:58

ఢిల్లీ: దేశ రాజధానిలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే నడిరోడ్డుపై కేటుగాళ్లు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రగతి మైదాన్ టన్నెల్‌లో కారును అడ్డగించి రూ.2 లక్షలను ఎత్తుకుపోయిన ఉదంతం మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తన దుకాణం ముందే ఓ వృద్ధుడిని గన్‌తో బెదిరించి రూ.లక్ష దోచుకెళ్లారు. 

ఢిల్లీలోని విహార్ హర్ష ప్రాంతంలో ఓ షాప్ ఓనర్(70) రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వెళ్లడానికి దుకాణాన్ని మూసేశారు. షాప్‌లో ఆ రోజు వచ్చిన లక్ష రూపాయల కలెక్షన్‌ను బ్యాగులో పెట్టుకుని చేతిలో పట్టుకున్నారు. షాప్‌ ముందే బైక్‌ మీద కూర్చున్న అతనిపై ఇద్దరు దొంగలు గన్‌తో బెదిరించి దాడి చేశారు. బ్యాగు లాక్కుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. దోషులకు కఠిన శిక్షలు విధిస్తామని తెలిపారు. 

ఇదీ చదవండి: దొంగలకు ఊహించని అనుభవం.. పైసలు దొరక్క.. తిరిగి రూ. 100 చేతిలో పెట్టి

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)