Breaking News

లోయలోకి వాహనం పల్టీ...

Published on Thu, 05/25/2023 - 06:05

జమ్మూ: విద్యుత్‌ ప్రాజెక్ట్‌లో పనిచేసే కార్మికులతో వెళ్తున్న వాహనం లోయలోకి పల్టీలు కొట్టడంతో ఏడుగురు మరణించిన ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిష్ట్‌వార్‌ జిల్లాలోని దఛన్‌ సమీపంలోని దాంగ్‌దూరు విద్యుత్‌ ప్రాజెక్ట్‌ దగ్గర్లో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రాజెక్ట్‌ సైట్‌ సమీపంలో ప్రమాదం జరగడంతో వందలాది మంది కార్మికులు ఘటనాస్థలికి చేరుకుని మృతుల కుటుంబాలకు కంపెనీనే నష్టపరిహారం చెల్లించాలని, క్షతగాత్రులకు తక్షణ ఆర్థికసాయం అందించాలని నిరసనకు దిగారు.

భారీ వర్షం పడుతుండటంతో డ్రైవర్‌కు సరిగా కనిపించకపోవడంతో కొండ మలుపులో వాహనం అదుపుతప్పింది. దీంతో కొండ నుంచి వందల మీటర్ల లోయలోకి వాహనం పల్టీకొట్టి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇద్దరు జార్ఖండ్‌ కార్మికులుసహా ఏడుగురు మరణించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ సహా పలు పార్టీల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)