Breaking News

ప్రమాదకర అంటువ్యాధి.. 15 రోజుల్లో ఏడు చిరుత కూనలు మృతి

Published on Tue, 09/19/2023 - 20:37

బెంగళూరు: కర్ణాటకలో చిరుత పిల్లల మరణాలు కలకలం రేపుతున్నాయి. తీవ్రమైన అంటువ్యాధి సోకి బెంగళూరులోని బన్నెరఘట్ట బయోలాజికల్‌ పార్క్‌లో ఏడు చిరుత కూనలు మృతిచెందాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అంటువ్యాధి ‘ఫీలైన్‌ పాన్ల్యూకోపెనియా బారిన పడి 15 రోజుల వ్యవధిలోనే 8 పిల్లలు మరణించినట్లు పార్క్‌ అధికారులు మంగళవారం వెల్లడించారు. 

అధికారుల వివరాల ప్రకారం.. ఆగస్టు 22న తొలిసారి ఈ వైరస్‌ బయటపడినట్లు తెలిపారు. 15 రోజుల్లోనే ఎనిమిది చిరుత పిల్లలకు వైరస్‌ సోకి చనిపోయినట్లు పేర్కొన్నారు. సఫారీ ప్రాంతంలో తొమ్మిది కూనలను వదిలిపెట్టగా వాటిలో నాలుగు వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. రెస్క్యూ సెంటర్‌లో ఉండే మరో మూడింటికి కూడా అంటువ్యాధి సోకి చికిత్స పొందుతూ మరణించాయన్నారు. 

మరణించిన ఏడు పిల్ల చిరుతల వయసు మూడు నుంచి ఎనిమిది నెలల లోపు ఉంటుందని పేర్కొన్నారు. అన్నీ కూనలకు వ్యాక్సినేషన్‌ చేయించినప్పటికీ వైరస్‌ సోకి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
చదవండి: జమ్మూకశ్మీర్ ఎన్‌కౌంటర్‌: లష్కరే తోయిబా కమాండర్‌ హతం

అయితే ప్రస్తుతం వైరస్‌లో నియంత్రణలో ఉందని.. గత 15 రోజులలో  ఎలాంటి మరణాలు సంభవించలేదని, వెటర్నటీ డాక్టర్‌లో చర్చలు జరిపి వైరస్‌ కట్టడికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని చెప్పారు.  అలాగే  జంతు ప్రదర్శనశాలలో పరిశుభ్రత చర్యలు చేపట్టామని రెస్క్యూ సెంటర్ పూర్తిగా శానిటైజ్ చేసినట్లు పేర్కొన్నారు.

ఫీలైన్‌  పాన్ల్యూకోపెనియా అనే అంటువ్యాధి పిల్లి జాతికి చెందిన పార్వేవైరస్‌ వల్ల కలుగుతుందని.. ఈ  వైరస్‌ ప్రభావం కూనలపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దీని బారిన పడితే.. జీర్ణవ్యవస్థ పూర్తిగా ప్రభావితమవుతుందని పేర్కొన్నారు. తీవ్రమైన విరేచనాలు, వాంతులు డీహైడ్రేషన్‌ లక్షణాలు కనిపిస్తాయని చివరికి మరణానికి దారితీస్తుందన్నారు. ఇది వేగంగా వ్యాపిస్తుందని,  వ్యాధి సోకిన నాలుగైదు రోజుల్లో జంతువు  చనిపోతుందని తెలిపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)