Breaking News

ఢిల్లీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం..

Published on Mon, 05/27/2024 - 04:22

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్‌ విహార్‌లో శనివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బేబీ కేర్‌ న్యూ బోర్న్‌ హాస్పిటల్‌లో  జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో మొదలైన మంటలు చుట్టుపక్కలున్న మరో రెండు భవనాలకు సైతం వ్యాపించినట్లు ఫైర్‌ సిబ్బంది తెలిపారు. 

మొత్తం 16 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చామన్నారు. ఆస్పత్రి రెండో అంతస్తులో నిల్వ ఉంచిన ఆక్సిజన్‌ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. మంటలు వ్యాపించిన ఆస్పత్రి భవనం నుంచి మొత్తం 12 మంది శిశువులను బయటకు తీసుకురాగా వారిలో ఏడుగురు చనిపోయారని ఫైర్‌ చీఫ్‌ అతుల్‌ గర్గ్‌ చెప్పారు. మిగతా ఐదుగురిలో కొందరు స్వల్పంగా గాయపడ్డారన్నారు. 

మంటలను గమనించిన స్థానికులు, షహీద్‌ సేవా దళ్‌ కార్యకర్తలు కలిసి భవనం వెనుక వైపు నుంచి నిచ్చెనల ద్వారా పైకెక్కి చిన్నారులను కిందికి తీసుకువచ్చారని ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది పరారైనట్లు చెబుతున్నారు. ఆస్పత్రి యజమాని నవీన్‌ కిచిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నామని షాదారా డీసీపీ సురేంద్ర చౌదరి చెప్పారు. ఈ దారుణంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ధైర్యంగా ఉండాలని బాధిత కుటుంబాలను కోరారు.

 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)