Breaking News

Bihar Election: 500 కేజీల లడ్డూలు, 5 లక్షల రసగుల్లాలు

Published on Fri, 11/14/2025 - 07:10

పట్నా: ఈరోజు(శుక్రవారం) వెలువడే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అధికార ఎన్‌న్డీఏ కూటమి విజయాన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆ  భాగస్వా​మ్యానికి  చెందిన నేతలు, కార్యకర్తలు ఇప్పటికే సంబరాలను ప్రారంభించారు.  రాజధాని పట్నాలో విజయోత్సవాలను జరుపుకునేందుకు 500 కేజీల లడ్డూలు, 5 లక్షల రసగుల్లాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. అలాగే భారీ విందు కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కృష్ణ సింగ్ కల్లు మాట్లాడుతూ 500 కిలోల లడ్డూలకు ఆర్డర్ ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,  ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చిత్రాలతో లడ్డూలు తయారు చేయిస్తున్నట్లు తెలిపారు.

స్థానిక బీజేపీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం ఈ విజయోత్సవాల కోసం ఐదు లక్షల రసగుల్లాలు,  గులాబ్ జామూన్లను సిద్ధం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు రోజున పలు ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి విజయోత్సవ ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.   ఈ కార్యక్రమాలకు నేతలను, కార్యకర్తలను, మద్దతుదారులను ఆహ్వానించారు. కొన్ని నియోజకవర్గాల్లో  ఎన్డీఏ, మహాకూలమి మధ్య గట్టి పోటీ ఉంటుందనే అంచనాలున్నాయి. అధికార కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని పాట్నాలోని వేడుకల వాతావరణం ప్రతిబింబిస్తోంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)