Breaking News

మరో 50 మంది భారతీయులు వెనక్కి 

Published on Tue, 10/28/2025 - 06:52

అంబాలా/కురుక్షేత్ర: ఏజెంట్లకు 30–40 లక్షల రూపాయలు ముట్టజెప్పి చిట్టడడవులు, నదులు దాటుకుంటూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించి అక్రమ మార్గం(డంకీ రూట్‌)లో అమెరికాలోకి చొరబడిన పలువురు భారతీయులను అమెరికా ప్రభుత్వం బహిష్కరించి తిరిగి స్వదేశానికి పంపేసింది. దాదాపు 50 మంది భారతీయ అక్రమ వలసదారులతో అమెరికా వాయుసేనకు చెందిన సీ–17 విమానం శనివారం అర్ధరాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు భారత్‌కు చేరుకుంది.

 తిరిగొచ్చిన వారిలో హరియాణా రాష్ట్రంలోని ఖైథాల్, కర్నాల్, కురుక్షేత్ర, అంబాలా, యమునానగర్, జింద్, పానిపట్‌ జిల్లాలకు చెందిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. తిరిగొచి్చన వారిలో ఎక్కువ మంది 25 నుంచి 40 ఏళ్ల వయసు వాళ్లే ఉన్నారు. విదేశంలోనైనా సంపాదించి భారత్‌లోని తమ కుటుంబసభ్యులకు మెరుగైన జీవితం అందివ్వాలన్న తమ అమెరికా కల కలగానే మారిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. 

‘‘అమెరికా వెళ్లేందుకు రూ.35 లక్షలు ఖర్చు చేశా. ఆ డబ్బంతా భారత్‌లో వ్యవసాయం చేసి సంపాదించా. ఎలాగోలా ఫ్లోరిడా సమీపంలోని జాక్సన్‌విల్లేలో పనిలో కుదిరా. వంట నేర్చుకున్నా. కానీ ట్రంప్‌ ప్రభుత్వం నన్ను అరెస్ట్‌చేసి వెనక్కి పంపేసింది. నా కుటుంబ బంగారు భవిష్యత్తు నాశనమైంది. నా డబ్బంతా వృథా అయింది. విమానంలో చేతులకు బేడీలు, కాళ్లకు ఇనుప గొలుసులు కట్టేశారు. 24 గంటలపాటు అలాగే తీసుకొచ్చారు. దీంతో నా కాళ్లు ఇలా పూర్తిగా ఉబ్బిపోయాయి ’’అని 45 ఏళ్ల అక్రమ వలసదారుడు హర్జీందర్‌ సింగ్‌ వాపోయారు.

 ‘‘కెనడాలో ఉండేవాడిని. తర్వాత రెండేళ్ల క్రితం వర్క్‌ పరి్మట్‌తో అమెరికాకు వెళ్లా. అక్కడ ఒక దుకాణంలో పనిచేస్తుంటే అరెస్ట్‌చేసి భారత్‌కు పంపేశారు’’అని కల్సీ గ్రామవాసి హరీశ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఎకరం పొలం అమ్మి, సోదరుడు, బంధువుల దగ్గర అప్పు చేసి మొత్తం రూ.57 లక్షలు ఏజెంట్‌కు ఇచ్చా. డంకీ రూట్‌లో అమెరికా వెళ్లా. కానీ అక్కడ దొరికిపోయా.14 నెలలపాటు బంధించి ఇప్పుడు భారత్‌కు పంపేశారు’’అని నరేశ్‌ కుమార్‌ చెప్పారు. గతంలో హరియాణా, పంజాబ్, గుజరాత్‌లకు చెందిన పలువురు అక్రమ వలసదారులను అమెరికా ఇమిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌చేసి భారత్‌కు సాగనంపడం తెల్సిందే.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)