Breaking News

ద్విచక్ర వాహనంపై ఐదుగురు.. రూ. 17 వేల జరిమానా!

Published on Sun, 04/07/2024 - 13:24

సాధారణంగా మనం ద్విచక్ర వాహనంపై ఇద్దరు లేదా ముగ్గురు రైడర్లను చూసి ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఒక బైక్‌పై ఐదుగురు కుర్రాళ్లు ప్రయాణిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఐదుగురు కుర్రాళ్లు బైక్‌పై వెళుతుండగా వారిని ట్రాఫిక్‌ పోలీసులు గమనించి, వారికి భారీ మొత్తంలో చలానా జారీచేశారు. 

ఈ ఉదంతం చిత్రకూట్ జిల్లాలోని ఖోహ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఓ బైక్‌పై ఐదుగురు కూర్చొని గ్రామంలో ఉల్లాసంగా తిరుగుతున్నారు. ఇంతలో వారికి ట్రాఫిక్ పోలీసులు తారసడ్డారు. చిత్రకూట్‌ ట్రాఫిక్‌ టీఎస్‌ఐ శైలేంద్రకుమార్‌ సింగ్‌ ఆ బైక్‌ నడిపే కుర్రాళ్లను అడ్డుకుని, వారికి రూ.17 వేలు చలానా జారీ చేయడంతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఉదంతం గురించి చిత్రకూట్ ట్రాఫిక్ టీఎస్‌ఐ శైలేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ కార్వీ కొత్వాలి ప్రాంతంలోని ఖోహ్ గ్రామంలో ఐదుగురు కుర్రాళ్లు బైక్‌పై వెళుతూ ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించడాన్ని గమనించామన్నారు. తరువాత వారిని ఆపి, వారి పేరు, చిరునామా తెలుసుకున్నామని, డ్రైవింగ్ లైసెన్స్ ను తనిఖీ చేశామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణిస్తున్న  ఈ ఐదుగురు కుర్రాళ్లకు రూ.17 వేలు చలాన్ జారీ చేశామన్నారు. అలాగే ఆ వాహనాన్ని సీజ్ చేశమన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)