Breaking News

Himachal: లోయలో పడిన బస్సు.. ఐదుగురు మృతి

Published on Thu, 07/24/2025 - 13:26

మండీ: హిమాచల్‌లోని మండీలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టీసీ)కు చెందిన బస్సు లోయలో పడి, ఐదుగురు మృతిచెందగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులంతా ప్రస్తుతం సర్కాఘాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలుస్తోంది.

ఈ దుర్ఘటన హిమాచల్‌లోని మండీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్కాఘాట్ సబ్-డివిజన్‌లోని మాసెరాన్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై  హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు విచారం వ్యక్తం చేశారు. హెచ్‌ఆర్‌టీసీ బస్సు లోయలో పడిపోవడం హృదయ విదారకమైనదని ఆయన పేర్కొన్నారు.

బాధితులకు వెంటనే వైద్యసాయం అందించాలని తాను అధికారులను ఆదేశించానని ఆయన తెలిపారు. ‘ఈ దుఃఖ సమయంలో, మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని సుఖ్‌విందర్ సింగ్ సుఖు‘ఎక్స్‌’ పోస్టులో తెలిపారు. పోలీసులు, స్థానిక అధికార యంత్రాంగం రిలీఫ్ ఆపరేషన్లలో చురుకుగా పాల్గొంది.
 

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)